NTR 30 Movie: ఎన్టీఆర్-కొరటాల సినిమాలో సోనాలి బింద్రే.. క్లారిటీ ఇచ్చిన అందాల తార..
NTR 30 Movie: ట్రిపులార్ (RRR) సినిమాతో భారీ విజయాన్ని అందుకొని ప్రస్తుతం ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో...

NTR 30 Movie: ట్రిపులార్ (RRR) సినిమాతో భారీ విజయాన్ని అందుకొని ప్రస్తుతం ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కొరటాల ఇందులో ఎన్టీఆర్ లుక్‌ను పూర్తిగా మార్చేయనున్నాడని చర్చ జరుగుతోన్న నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో వర్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. మొన్నటి వరకు ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్స్ గురించి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
మొదట ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ నటిస్తుందని, ఆ తర్వాత అనన్య పాండే అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇంత వరకు చిత్ర యూనిట్ ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం ఇవ్వలేదు. ఇదిలా ఉంటే తాజాగా నెట్టింట మరో వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో అలనాటి అందాల తార సోనాలి బ్రింద్రేను ప్రత్యేక పాత్ర కోసం తీసుకోనున్నారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సోనాలి బింద్రేకు నేరుగా ఇదే ప్రశ్న ఎదురైంది.
ఈ ప్రశ్నకు బదులిచ్చిన సోనాలి ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారు. ఎన్టీఆర్ సినిమాలో నేను నాటిస్తున్నానా.? నాకు ఆ విషయం తెలియదు. దాని గురించి మీరే చెప్పండి. మీరు మాట్లాడుతున్న దాని గురించి నాకు అస్సలు సమాచారం లేదు. బహుశా ఆ సినిమాలో నటిస్తోంది నేను కాదేమో. అవన్నీ తప్పుడు ప్రచారాలు. ఇప్పటి వరకు ఈ విషయమై నన్ను ఎవరూ సంప్రదించలేరు. ఇదంతా ఏదో థ్రిల్లర్‌లా ఉంది’ అంటూ సోనాలి ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..



