Pooja Hegde: కష్టపడతాను.. కానీ కుంగిపోయి కూర్చోను.. ఫెయిల్యూర్స్ పై పూజా హెగ్డే కామెంట్స్..
టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి చెప్పక్కర్లేదు. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు మాత్రం వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు. కొన్నాళ్లుగా ఈ బుట్టబొమ్మ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుస్తున్నాయి. మరోవైపు ఇప్పుడిప్పుడే పూజాకు తెలుగు, తమిళంలో వరుస అవకాశాలు వస్తున్నాయి.

పూజా హెగ్డే.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ సెన్సేషన్‌గా మారుతున్నారు. పడి లేవడంలో మజా గురించి మాట్లాడుతున్నారు పూజా హెగ్డే. అదొక్కటేనా? అంటే… నో నో.. చాలా విషయాల మీద నాకు క్లారిటీ ఉందని క్లియర్‌గానే చెప్పేస్తున్నారు. ఇంతకీ ఫెయిల్యూర్స్ గురించి పూజా హెగ్డే ఏమన్నారు? ”ఫెయిల్యూర్ అనే పదాన్ని చాలా మంది నెగటివ్‌గా వాడుతున్నారు. అసలు అలా ఎందుకు వాడుతున్నారో నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఫెయిల్యూర్ అంటే… సక్సెస్‌కి మరో అవకాశం అని అర్థం. మనలోని లోటుపాట్లను అర్థం చేసుకుని, తప్పులను సరిదిద్దుకుని ఇంకాస్త కష్టంగానూ, ఇష్టంగానూ పనిచేస్తే సక్సెస్‌కి చేరువవుతామని అర్థం. అందుకే నేను ఫస్ట్ నుంచీ ఫెయిల్యూర్ అనే పదాన్ని ఇంకో అవకాశానికి తొలి మెట్టుగానూ, సక్సెస్‌కి చివరి మెట్టుగానూ భావిస్తాను. అలాగే కష్టపడతాను. అంతేగానీ, కుంగిపోయి కూర్చోను అని అన్నారు పూజా హెగ్డే.
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?
ఇంకా చాలా విషయాల మీద ఉన్న క్లారిటీ ఏంటని ఆరా తీస్తే.. క్రిటిసిజమ్ గురించి తనకున్న అవగాహనను పంచుకున్నారు ఈ లేడీ. ”విమర్శలను నేను ఇష్టపడతాను. నేను ఒక పోస్టు పెడుతున్నానంటే దాని కింద వచ్చే కామెంట్లను కచ్చితంగా చదువుతాను. ఫ్యాన్స్ వారిలో వారు చేసుకునే డిస్కషన్‌ని అబ్జర్వ్ చేస్తాను. ఇది తప్పు.. అది తప్పు అని పోస్టులు పెట్టేవారిని నేను పట్టించుకోను. అది అలా చేయాల్సిందేమో.. ఇలా ఉంటే ఇంకా బావుండేది అని సలహాలు ఇచ్చేవారు కొందరు ఉంటారు. అలాంటివారిని నేను ఇష్టపడతాను. వారు చెప్పిన వాటిని నోట్ చేసుకుని, నేను చేసిన సీన్స్ తో పోల్చి చూసుకుంటాను. నేను కన్విన్స్ అయితే నెక్స్ట్ టైమ్ నుంచి ఫాలో అవుతాను. చాలా సందర్భాల్లో ఇంత క్లారిటీగా ఉంటే మనం కెరీర్‌ని సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేయగలం” అని అన్నారు పూజా హెగ్డే.
ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..
కోలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు పూజా హెగ్డే. విజయ్‌తో నటించిన జననాయగన్‌తో నెక్స్ట్ ఇయర్ రిలీజుల పరంపర మొదలవుతుంది. తెలుగులో దుల్కర్ సినిమా మీద మంచి హోప్స్ పెట్టుకున్నారు ఈ లేడీ. తాజాగా ఈ అమ్మడు అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?








