AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajesh Danda: నా సినిమాను చంపేస్తుంటే నాకు కోపం రాదా.. నేను మనిషినే కదా.. నిర్మాత రాజేష్ దండా..

కోట్ల రూపాయాలు ఖర్చు చేసిన నా సినిమాను చంపేస్తూ.. నాకు కోట్ల నష్టం కలిగించే ప్రయత్నం చేస్తుంటే కోపం రాదా.. నేనూ మనిషినే కదా.. అందుకే అలా మాట్లాడానూ.. నాకోపం మీడియా మీద కాదు.. ఆ ముసుగులో సినిమాలను చంపుతున్న వాళ్ల మీద అంటూ ఆవేదన వ్యక్తం చేశారు నిర్మాత రాజేశ్ దండా. కె ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్ లో చేసిన తన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు నిర్మాత రాజేశ్ దండా.

Rajesh Danda: నా సినిమాను చంపేస్తుంటే నాకు కోపం రాదా.. నేను మనిషినే కదా.. నిర్మాత రాజేష్ దండా..
Rajesh Danda
Rajitha Chanti
|

Updated on: Oct 22, 2025 | 12:36 PM

Share

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటేస్ట్ గా నటించిన సినిమా కె ర్యాంప్. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత రాజేష్ దండా నిర్మించగా.. దీపావళీ కానుకగా వచ్చిన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్టైంది. ఇందులో కిరణ్ సరసన యుక్తి తరేజా నటించగా.. ఈ చిత్రానికి మంచి వసూళ్లు వస్తున్నాయి. ఓవైపు ఈ చిత్రానికి పాజిటివ్ మౌత్ టాక్ వస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం నెగిటివ్ రివ్యూస్, ఆర్టికల్స్ వైరల్ చేస్తున్నారు కొందరు. దీంతో కె ర్యాంప్ సక్సెస్ మీట్ లో నిర్మాత రాజేష్ దండా ఓ వెబ్ సైట్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైన ఓ వెబ్ సైట్ మాత్రం ఇంకా ఏడుస్తూనే ఉందని.. అమెరికాలో ఉన్నవాడికే చెప్తున్నా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే నిర్మాత రాజేష్ దండా వ్యాఖ్యలపై కొందరు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు కొన్ని పదాలు వాడాకుండా ఉండాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో తన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు నిర్మాత రాజేష్ దండా.

ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..

“నిర్మాతగా, పంపిణీ దారుగా రాజేష్ దండా మీడియాతో ఎలాంటి గౌరవ మర్యాదలతో వుంటాడు అన్నది మీడియా మిత్రులు అందరికీ తెలుసు. అలాంటి నేను నిన్న ఎందుకు ఓ వెబ్ సైట్ పట్ల, ఆ వెబ్ సైట్ నిర్వాహకుల పట్ల, పరుషంగా మాట్లాడాల్సి వచ్చింది. కోట్లు ఖర్చు పెట్టి నిర్మాతగా ఓ సినిమా తీసాను. ఓ వెబ్ సైట్ దానిని సమీక్షించి, దానికో రేటింగ్ ఇచ్చింది. అంత వరకు నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ సినిమాను జనం ఆదరిస్తున్నారు. ఆ విధంగా సినిమా హిట్ అయితే ఆ సైట్ సమీక్షల క్రెడిబులిటీ పోతుంది. అందుకే వాళ్ల రేటింగ్ ను నిలబెట్టుకోవాలని నా సినిమా మీద నెగిటివ్ పోస్ట్ లు, నెగిటివ్ వార్తలు వేయడం ప్రారంభించారు. గతంలో మ్యాడ్ 2 సినిమా విషయంలో ఇంకో వెబ్ సైట్ ఇలాగే చేస్తే, నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించారు. అప్పుడు కూడా ఆయన చెప్పారు. మా మీద ఆధారపడి వెబ్ సైట్ లు నడుపుతూ ఇలా చేయడం తప్పు అని చెప్పారు.

ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..

ఇప్పుడు నేనూ అదే చెబుతున్నాను. అయితే నేను వాడిన భాష అభ్యంతరకరం అని అంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసిన నా సినిమాను చంపేస్తూ, నాకు కోట్ల నష్టం కలిగించే ప్రయత్నం చేస్తుంటే కోపం రాదా..నేనూ మనిషినే కదా. అందుకే అలా మాట్లాడాను. అంతకు మించి మరే మీడియా సంస్థ మీద, మరే మీడియా వ్యక్తి మీద నాకు ఏ కోపం లేదు. పైగా 150 మందికి పైగా వున్న సినిమా జర్నలిస్ట్ లు, సోషల్ మీడియా జనాలు, మీమర్స్ అందరూ నాకు అత్యంత సన్నిహితులే. వారంటే నాకు ఎప్పుడూ గౌరవం వుంటుంది. నా బాధ, కోపం లో వచ్చిన భాషను సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నా యుద్దం మీడియా మీద కాదు.. మీడియా ముసుగు లో సినిమా లను చంపుతున్నవాళ్లమీద” అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం రాజేష్ దండా చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?

మరోవైపు అన్ని ప్రధాన డిజిటల్ మీడియా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సౌత్ ఇండియా డిజిటల్ పబ్లిషర్స్ అసోసియేషన్, SIDPA, తెలుగు సినిమా నిర్మాత రాజేష్ దండా చేసిన వ్యాఖ్యలను ఖండించింది.

ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‏తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?