AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: వాల్తేరు వీరయ్య సెట్‏లో పవన్ కళ్యాణ్ సందడి.. అన్నయ్యతో పవర్ స్టార్ చిరునవ్వులు..

చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రతి అప్డేట్ మాస్ కి పూనకాలు తెప్పిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్- బాస్ పార్టీ సాంగ్

Pawan Kalyan: వాల్తేరు వీరయ్య సెట్‏లో పవన్ కళ్యాణ్ సందడి.. అన్నయ్యతో పవర్ స్టార్ చిరునవ్వులు..
Pawan Kalyan, Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Nov 22, 2022 | 7:09 PM

Share

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న మెగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వాల్తేర్ వీరయ్య’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు . చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రతి అప్డేట్ మాస్ కి పూనకాలు తెప్పిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్- బాస్ పార్టీ సాంగ్ రేపు విడుదలౌతున్న సంగతి తెలిసిందే. దాని కంటే ముందు చిరంజీవి, ఊర్వశి రౌతేలాపై చిత్రీకరించిన ఈ పాట ప్రోమోని విడుదల చేశారు. ఈ పాట చిరంజీవి వింటేజ్ మాస్ అవతార్ ని ప్రజంట్ చేసింది. ప్రోమో పాటను చూడాలనే ఉత్సాహాన్ని పెంచింది. అయితే తాజాగా వాల్తేరు వీరయ్య సెట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేశారు. అన్నయ్య చిరుతో కలిసి చిరునవ్వులు చిందిస్తున్నారు. ప్రస్తుతం చిరు.. పవన్ చిందిస్తున్న ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

బాస్ పార్టీ సాంగ్ పవన్ వీక్షించారు. వాల్తేరు వీరయ్య షూటింగ్ స్పాట్ కు తన హరిహర వీరమల్లు చిత్ర దర్శకుడు క్రిష్.. నిర్మాత ఎ.ఎం రత్నంతో కలిసి వెళ్లారు. ఈ పాటను దర్శకుడు బాబీ పవన్ కు చూపించారు. ఆయనకు ఈ పాట ఎంతో నచ్చిందని.. తనను అభినందించారని బాబీ అన్నారు. ఈ సాంగ్ ప్రోమోలో చిరంజీవి గళ్ళ లుంగీ, కలర్ ఫుల్ షర్ట్ లో తనదైన స్టయిల్ లో నడుస్తూ మెగా మాస్ ఎంట్రీ ఇచ్చారు. ప్రోమోలో కనిపించిన మెగా వాకింగ్ స్టయిల్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసింది. అయితే మాస్ మూల విరాట్ దర్శనం కోసం పాట విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు సాహిత్యం అందించడంతో పాటు నకాష్ అజీజ్, హరిప్రియతో పాటు ఆలపించారు. మాస్ సాంగ్స్ స్పెషలిస్ట్ శేఖర్ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రాఫర్. పాటను చిత్రీకరించిన భారీ సెట్ను కూడా ప్రోమోలో చూడవచ్చు. లిరికల్ వీడియో రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.