OG Pre release event Highlights: ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భారీ వర్షం.. ఏదీ మనల్ని ఆపలేదు: పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్‌తో సాహో సినిమా తెరకెక్కించిన సుజిత్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఎలాంటి సినిమా చేస్తారా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న నయా మూవీ ఓజీ. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఓజీ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను విడుదల చేసిన టీజర్ పవన్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం పేక్షకులంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.. హరిహరవీరమల్లు సినిమా తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డిఫరెంట్ లుక్ లో ఓ సమురాయ్ లా కనిపించనున్నాడు. అలాగే ఈ మూవీలో పవన్ కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. ఈ సినిమాతో పవన్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయం అంటున్నారు అభిమానులు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో గ్రాండ్‌గా జరుగుతుంది. ఈ ఈవెంట్ కు భారీగా అభిమానులు తరలి వచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
LIVE NEWS & UPDATES
-
వర్షం కారణంగా త్వరగా ముగిసిన ఈవెంట్
వర్షం కారణంగా ఓజీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను త్వరగా పూర్తి చేశారు. అభిమానులు నిరుత్సహ పడకుండా పవన్ కళ్యాణ్ తన స్పీచ్ తో అదరగొట్టారు. వర్షం కారణంగా ఈవెంట్ ను త్వరగా ముగించారు
-
ఆడ సివంగి.. ఆమె పంచ్ పవర్ ఎక్కువ : శ్రియ రెడ్డి గురించి పవన్
ఆడ సివంగి.. ఆమె పంచ్ పవర్ ఎక్కువ.. ఆమె చాలా ఫిట్ నెస్ తో ఉంటారు. ఆమె నన్ను ఒకటే అడిగారు.. మనం కలిసి ఓ పవర్ ఫుల్ యాక్షన్ సినిమా చేద్దాం.!
-
-
పవన్ కళ్యాణ్‌కు ఏదీ ఊరికే రాదు.. వర్షం కూడా మనల్ని ఆపలేదు: పవన్
పవన్ కళ్యాణ్ కు ఏదీ ఊరికే రాదు.. అన్నిటిని అధిగమించి ఈ 25న వస్తున్నాం.. ట్రైలర్ ఇంకా రెడీ అవ్వలేదని చెప్పిన పవన్. వర్షం మనల్ని అపుద్దా.. ? వర్షం మనల్ని అపుద్దా.. ?ఏది మనల్ని ఆపింది.. ఓటమి ఆపిందా.? వర్షం కూడా మనల్ని ఆపలేదు.. అన్నారు పవన్
-
ఈ టీమ్ ఉండుంటే.. నేను పాలిటిక్స్‌లోకి వచ్చేవాడిని కాదు: పవన్
నాకు జాపనీస్ తెలియదు కానీ పట్టుబట్టి నాకు నేర్పించాడు. సుజిత్ టీమ్ ను కూడా మెచ్చుకుంటున్నా.. అలాంటి టీమ్ నాకు ఉండుంటే.. నేను డైరెక్షన్ చేసే సమయంలో ఈ టీమ్ ఉండుంటే.. నేను పాలిటిక్స్ లోకి వచ్చేవాడిని కాదు.
-
హీరోయిన్ అద్భుతంగా నటించింది: పవన్ కళ్యాణ్
హీరోయిన్ గురించి మాట్లాడుతూ.. ప్రియాంక అద్భుతంగా నటించింది. హీరో, హీరోయిన్ మధ్య లవ్ స్టోరీని చాలా హృద్యంగా తీశాడు సుజిత్
-
-
సుజిత్ మాములుగా తీయలేదు సినిమా : పవన్
సుజిత్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఒక అభిమాని .. మాములు అభిమాని కాదు.. ఇతని స్థాయి, విజన్.. సినిమా తీయాలని సాహో సినిమా తీసిన తర్వాతగా త్రివిక్రమ్ సుజిత్ ను నాకు పరిచయం చేశారు. సుజిత్ కథ చెప్పేది తక్కువ కానీ చేసేది ఎక్కువ. ఈ సినిమా ఇద్దరే స్టార్స్ నేను కాదు.. డైరెక్టర్ సుజిత్, తమన్. ఈ ఇద్దరూ ఓ పిచ్చిలో చేశారని అన్నారు పవన్. అందులోకినన్ను కూడా లాగేశారు. నేను డిప్యూటీ సీఎం అనేది కూడా మర్చిపోయాను. ఓ డిప్యూటీ సీఎం ఇలా కత్తిపట్టుకొని వస్తే ఎవరైనా ఊరుకుంటారా.? ఖుషీలో నేను ఇలా కట్టిపట్టుకొని చేశా.. ఆ సమయంలో నేను నేర్చుకున్నా..
-
పాట పాడి అదరగొట్టిన పవన్ కళ్యాణ్..
ఓషి..యా ఓషి అంటూ సినిమాలోని హైకూ పాడి వినిపించిన పవన్ కళ్యాణ్.. ఓమీ.. ఓమీ.. ఎగిరెగిరి పడుతున్నావ్.. గాలిలో ఎగిరే నిన్ను ఎలా నేలకు దించాలో నాకు తెలుసు. ఓషి..యా ఓషి.. ఓషి..యా ఓషి అంటూ పాట పాడిన పవన్ కళ్యాణ్
-
స్పీచ్ తో అదరగొట్టిన పవన్ కళ్యాణ్
స్పీచ్ తో అదరగొట్టిన పవన్ కళ్యాణ్.. జాపనీస్ డైలాగ్ తో మొదలు పెట్టిన పవన్.. ఎప్పుడు ఈవెంట్ కు ఇలా నేను రాలేదు. సుజిత్ వల్ల సినిమాలో కనిపించిన కాస్టిమ్ తో వచ్చాను మీకోసం..
-
కత్తితో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్..
కత్తితో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఒక్కసారిగా హోరెత్తిన స్టేడియం..
-
పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ ఎంట్రీ
పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ ఎంట్రీ.. బ్లాక్ అండ్ బ్లాక్ లో అదరగొట్టిన పవన్ కళ్యాణ్
-
ఇంత పెద్ద ఈవెంట్ ను ఎప్పుడూ చూడలేదు.. : ప్రియాంక
ఇంత పెద్ద ఈవెంట్ ను ఎప్పుడూ చూడలేదు.. మిమ్మల్ని ఇక్కడ చూసి చాలా ఆనందంగా ఉంది అని హీరోయిన్ ప్రియాంక మోహన్ తెలిపింది.
-
ఫైర్ స్టోర్మ్ వస్తుందనుకుంటే .. రెయిన్ స్టోర్మ్: సుజిత్
ఫైర్ స్టోర్మ్ వస్తుందనుకుంటే .. రెయిన్ స్టోర్మ్
-
వర్షమా.. బొక్క.. మనల్నెవర్రా ఆపేది: తమన్
వర్షమా.. బొక్క.. మనల్నెవర్రా ఆపేది.. చాలా మంది చాల దూరం నుంచి వచ్చారు థాంక్యూ..
-
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వర్షం..
ఈవెంట్ లో ఒక్కసారిగా వర్షం.. తడుస్తూనే ఈవెంట్ ను వీక్షిస్తున్న అభిమానులు
-
యాంకర్‌గా సుమ కనకాల
ప్రీ రిలీజ్ ఈవెంట్ హోస్ట్ గా సుమ కనకాల.. ఈవెంట్ ను అదిరిపోయే డైలాగ్స్ తో ఎంట్రీ ఇచ్చారు సుమ..
-
హాజరైన అల్లు అరవింద్
ఈవెంట్ కు హాజరైన నిర్మాత అల్లు అరవింద్
-
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI):
సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.
-
ఓజీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ ఇక్కడ చూడండి ..
-
సినిమా పక్కా బ్లాక్ బస్టర్ : నిర్మాత డివివి దానయ్య
సినిమా అద్భుతంగా ఉంటుందని నిర్మాత డివివి దానయ్య … డిఫరెంట్ గా చేద్దామని ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇలా ఏర్పాటు చేశామని దానయ్య అన్నారు.
-
పవన్ కళ్యాణ్ పేరుతో మారుమ్రోగుతున్న స్టేడియం..
ఓజీ ఈవెంట్‌కు సర్వం సిద్ధం.. పవన్ కళ్యాణ్ పేరుతో మారుమ్రోగుతున్న స్టేడియం..
-
భారీగా చేరుకుంటున్న అభిమానులు..
పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగుతుంది. ఈవెంట్ కు భారీగా అభిమానులు చేరుకుంటున్నారు. సినిమా పక్కా విజయం సాదిస్తునని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Published On - Sep 21,2025 6:10 PM




