Pawan Kalyan: రీ రిలీజ్‌కు రెడీ అవుతున్న పవన్ మరో బ్లాక్ బస్టర్ మూవీ.. ఫ్యాన్స్‌కు పండగే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ స్టైల్ కు యాటిట్యూడ్ కు వీరాభిమానులు ఉన్నారు.

Pawan Kalyan: రీ రిలీజ్‌కు రెడీ అవుతున్న పవన్ మరో బ్లాక్ బస్టర్ మూవీ.. ఫ్యాన్స్‌కు పండగే..
Pawan Kalyan
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 25, 2022 | 3:24 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ స్టైల్ కు యాటిట్యూడ్ కు వీరాభిమానులు ఉన్నారు. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో హీరోగా పరిచయం అయిన పవన్.. సుస్వాగతం, తొలిప్రేమ సినిమాలతో మంచి లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఖుషి సినిమా పవన్ రేంజ్ ను అమాంతం పెంచేసింది. ఎస్ జే సూర్య దరర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. పవన్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది ఖుషి. భూమిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. టీవీలో ఖుషి సినిమా వచ్చిందటే చాలు ఛానల్ మార్చకుండా చూస్తుంటారు ప్రేక్షకులు. ఇప్పుడు ఈ సినిమా మరోసారి థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతోంది.

ఇటీవల టాలీవుడ్ లో నయా ట్రెండ్ ఒకటి హల్ చల్ చేస్తోంది. హీరోల బర్త్ డేలకు వల్ల సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ కంటిన్యూ అవుతోంది. మహేష్ బర్త్ డే సందర్భంగా పోకిరి సినిమా, ఒక్కడు సినిమా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అలాగే పవన్ పుట్టిన రోజు సందర్భంగా జల్సా, తమ్ముడు సినిమాలను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు మరోసారి పవన్ సినిమా కూడా రిలీజ్ అవ్వనుంది. డిసెంబర్ 31 మరియు జనవరి 1వ తారీకున ఖుషి సినిమాను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మరియు అమెరికా.. ఆస్ట్రేలియా ఇంకా పలు దేశాల్లో కూడా ఖుషి సినిమాను విడుదల చేస్తారని తెలుస్తోంది. నూతన సంవత్సరం సందర్భంగా ఖుషి సినిమాను రీరిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎన్ని రికార్స్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..