Tollywood: సంక్రాంతి బరిలో బడా సినిమాలు.. మెగాస్టార్, రెబల్ స్టార్‌కు పోటీగా ఆ హీరో కూడా..
సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ఇండస్ట్రీకి కొత్త కళ వచ్చినట్టే.. పెద్దపండగ అయిన సంక్రాంతిని టార్గెట్ చేసుకోని బడా సినిమాలన్నీ రిలీజ్ కు రెడీ అవుతుంటాయి
సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ఇండస్ట్రీకి కొత్త కళ వచ్చినట్టే.. పెద్ద పండగ అయిన సంక్రాంతిని టార్గెట్ చేసుకోని బడా సినిమాలన్నీ రిలీజ్ కు రెడీ అవుతుంటాయి. పెద్ద సినిమాలే కాదు.. చిన్న సినిమాలు కూడా సంక్రాంతి బరిలో కి దిగుతుంటాయి. ఈ సారి కూడా సంక్రాంతి సీజన్ మంచి రసవత్తరంగా జరగనుంది. ఇప్పటికే సంక్రాంతిని టార్గెట్ చేసుకొని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఆదిపురుష్(Adipurush) సినిమా రెడీగా ఉంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తోంది. రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ లంకేశ్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీని సంక్రాంతి బరిలో దించాలని దర్శక నిర్మాతలు చూస్తున్నారు. ఆదిపురుష్ 2023 జనవరి 12న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.
ఇక మెగా స్టార్ చిరంజీవి కూడా సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారు. ప్రస్తుతం చిరు వరుస సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మెగాస్టార్. ఈ సినిమా తర్వాత భోళాశంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు చేస్తున్నాడు. వీటిలో మెగాస్టార్ 154 సినిమా గా వస్తోన్న వాల్తేరు వీరయ్య సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మెగాస్టార్ ఫుల్ మాస్ మసాలా పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలతో పోటీగా దళపతి విజయ్ కూడా రంగంలోకి దిగనున్నాడు. ప్రస్తుతం విజయ్ టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వారసుడు అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ సినిమాలో లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పీవీపీ సినిమాస్ సహకారంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ నిర్మిస్తున్నారు. మరి ఈ మూడు సినిమాలు ప్రేక్షకులను ఈ స్థాయిలో ఆకట్టుకుంటాయో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..