AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VK Naresh- Pavithra Lokesh: ‘ప్రస్తుతం నరేష్‌కి తోడుగా ఉంటున్నా’.. పవిత్రా లోకేశ్ కామెంట్స్.. ఒక్క రోజులో అంతా రివర్స్

గురువారం తనపై తప్పుడు రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారని సైబర్ క్రైమ్‌కి కంప్లైంట్ చేసిన పవిత్రా లోకేశ్.. శుక్రవారం.. తాను నరేశ్‌కి తోడుగా ఉంటున్నట్లు సంచలన కామెంట్స్ చేశారు. దీంతో వారి మధ్య బంధంపై దాదాపు క్లారిటీ వచ్చేసింది.

VK Naresh- Pavithra Lokesh: 'ప్రస్తుతం నరేష్‌కి తోడుగా ఉంటున్నా'.. పవిత్రా లోకేశ్ కామెంట్స్.. ఒక్క రోజులో అంతా రివర్స్
Pavitra Lokesh Vk Naresh
Ram Naramaneni
|

Updated on: Jul 01, 2022 | 4:17 PM

Share

Actor Naresh 4th Marriage: ఆరుపదుల వయస్సులో అంతే మెయింటెనెన్స్‌. విలాసవంతమైన జీవితం. నిర్మలమ్మ నుంచి వచ్చిన డబ్బు, చిత్రపరిశ్రమలో హోదా, రాజకీయాల్లోనూ ప్రవేశం. సాఫిగా సాగుతోన్న జీవితం. అయితే సీనియర్ నటుడు నరేష్‌ పర్సనల్‌ టాపిక్‌ ఇప్పుడు పబ్లిక్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.  నటుడు నరేష్‌ నాలుగో పెళ్ళి.. ఇటు తెలుగు నాట, అటు కన్నడ చిత్రసీమలో  ట్రెండింగ్ టాపిక్‌ అయ్యింది. ఇటు నరేష్‌… అటు పవిత్ర. మధ్యలో నరేష్‌ మూడో భార్య రమ్య, పవిత్ర సహచరుడు సుచేంద్ర. దక్షిణాదిలో ఏ నోట విన్నా వీరి గురించే డిస్కషన్. తెరవెనుక కథను తెరపైకి తెస్తోన్న నాలుగుస్థంభాలాట గురించే ఇప్పుడు టాక్ అంతా. నరేష్‌ నాలుగో పెళ్ళిపై సర్వత్రా చర్చ రచ్చ రంబోలాగా మారింది. విజయనిర్మల ముద్దుల కొడుకు నరేష్‌కి ఒకటి కాదు, రెండు కాదు ఇప్పటికి ముచ్చటగా మూడుపెళ్ళిళ్ళయ్యాయి.  ఇప్పుడు నరేష్‌ నాలుగో పెళ్ళి వ్యవహారం తెరపైకి వచ్చింది. నరేష్‌ కన్నడ నటి పవిత్రల మధ్య రిలేషన్‌షిప్‌పై గత చాలా రోజులుగా పుకార్లు గుప్పుమంటున్నాయి. నరేష్‌, పవిత్ర, ఇద్దరి మధ్యా ప్రేమ బంధం పెనవేసుకుందనీ, వీరిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారన్న వార్తలు సర్వత్రా హల్‌చల్‌ చేశాయి.  మరో వైపు కన్నడ నటి పవిత్ర మొదటి భర్త సుచేంద్రకి విడాకులిస్తోందనీ, అక్కడ ఓకే అయితే నరేష్‌, పవిత్రల పెళ్ళికి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్టేనన్న వార్తలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు తాజాగా నరేష్‌ మూడో భార్యకి నరేష్‌ నుంచి డైవర్స్‌ నోటీసులు అందడంతో నరేష్‌ నాలుగో పెళ్ళి వ్యవహారం పీక్స్‌ కి చేరింది.

సినీ ఇండస్ట్రీలో మంచి పేరు, చేతినిండా డబ్బు. నరేష్‌ ది పీస్‌ ఫుల్‌ లైఫ్‌. నరేష్‌కి గతంలో మూడు పెళ్ళిళ్ళయ్యాయి. ఇప్పుడు పవిత్రతో వివాహం జరిగితే అది నాలుగు పెళ్ళి. మొదట సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను వివాహం చేసుకున్నాడు నటుడు నరేష్‌. వీరిరువురికీ నవీన్ జన్మించిన తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. తర్వాత రెండో పెళ్ళి. దానికి కూడా విడాకులతో తెరపడింది. ఆ తరువాత ఐదు పదుల వయస్సులో ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయకుడు రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను 2010 డిసెంబరు 3న హిందూపురంలో వివాహం చేసుకున్నాడు నరేష్‌. అయితే ఆమె నుంచి వేరుగా ఉంటున్నారు గానీ ఇంకా విడాకులు అయితే తీసుకోలేదు. అదే ఇప్పుడు సమస్యగా మారింది. తాను విడాకులు ఇవ్వకుండా నరేష్ మరో పెళ్లి ఎలా చేసుకుంటారన్నది ఆమె ప్రశ్న. నరేష్ వయస్సు 62 ఏళ్లు కాగా.. పవిత్రా లోకేష్ వయస్సు 43. వీరిద్దరి మధ్య 19 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. అయితే మాది ఎమోషనల్‌ బాండింగ్ అంటున్నారు నరేష్‌. పవిత్రకీ తనకీ మధ్య ఆ భావోద్వేగపరమైన సామీప్యత ఉందని నరేష్‌ చెబుతున్నారు. మరోవైపు నరేష్‌ ప్యూర్‌ జెంటిల్మన్‌ అన్నారు పవిత్రా లోకేష్‌. ఆయన జీవితంలో జరిగిందంతా చెప్పారని.. తమ ఇద్దరి మధ్య దాపరికాలు ఏమీ లేవని చెబుతున్నారు. నరేష్‌ హైదరాబాద్‌లో నివశిస్తుంటే.. ఆయన మూడో భార్య బెంగళూరులో ప్రెస్‌మీట్లు పెట్టడమేంటని ప్రశ్నించారు. కేవలం నేమ్‌, ఫేమ్‌ కోసమే రమ్య మీడియా ముందుకు వచ్చారని ఆరోపించారు. సుచేంద్రతో 2017లోనే విడిపోయానని.. ప్రస్తుతం నరేష్‌కి తోడుగా ఉంటున్నానన్నారు పవిత్ర. నరేష్‌ వ్యక్తిగత వ్యవహారాలు ఆయన చూసుకుంటారని.. తన వ్యక్తిగత వ్యవహారాలను తాను చూసుకుంటానని.. ఈ విషయంలో ఇద్దరికీ క్లారిటీ ఉందన్నారు పవిత్రా లోకేష్‌. కొన్నిరోజుల క్రితం కర్నాటకలోని ఓ స్వామీజీ దగ్గరకు నరేష్‌, పవిత్రాలోకేష్‌ కలిసి వెళ్లి ఆశీస్సులు తీసుకోవడంతో.. త్వరలోనే పెళ్లిచేసుకుంటారన్న వదంతులు వచ్చాయి.

కాగా తన మొదటి భర్తగా ప్రచారం అవుతున్న సుచేంద్ర ప్రసాద్ ని కూడా వివాహం చేసుకోలేదన్నారు పవిత్ర. ఆయనతో తాను సహజీవనం చేశానని.. పెళ్లి కాలేదు కాబట్టి విడాకుల ప్రస్తావనే లేదన్నారు.  ఇక ఆమెకు కాపురాలు కూల్చడం అలవాటేనని.. ఆమెది పైలాపచ్చీసు జీవితమని, అందుకే తనను వదిలేసి వెళ్లిందని కామెంట్లు చేసిన సుచేంద్రపై కూడా పనిలో పనిగా సీరియస్ అయ్యారు. సుచేంద్రను అసలు పెళ్లే చేసుకోలేదంటూ చెప్పేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి