AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thor Love and Thunder: థోర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. యుఎస్‌ కంటే ముందే ఇండియాలో రిలీజ్

హాలీవుడ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. మనదగ్గర కూడా హాలీవుడ్ మూవీస్ మంచి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే.

Thor Love and Thunder: థోర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. యుఎస్‌ కంటే ముందే ఇండియాలో రిలీజ్
Thor
Rajeev Rayala
|

Updated on: Jul 01, 2022 | 3:36 PM

Share

హాలీవుడ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. మనదగ్గర కూడా హాలీవుడ్ మూవీస్ మంచి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. అన్నిభాషల్లో సూపర్ హీరోల సినిమాలు విడుదలవుతు ఉంటాయి. ఇప్పటికే మర్వెల్, డిస్ని మూవీస్ విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాయి. మార్వెల్(Marvel) సినిమాటిక్ యూనివర్స్ లో ఇప్పటికే చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వచ్చిన అన్ని సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది.ఇటీవలే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి డాక్టర్ స్ట్రేంజ్ మల్టీ యూనివర్స్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు థోర్ లవ్ అండ్ థండర్(Thor Love and Thunder) మూవీ రానుంది.

తాజాగా ఈ చిత్రయూనిట్ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది. మీరు అడిగారు మార్వెల్ మీ మాట విన్నారు! అభిమానుల నుండి అపూర్వమైన ప్రేమ మరియు డిమాండ్ కారణంగా, థోర్: లవ్ అండ్ థండర్ క్రేజీ అప్డేట్ అంటూ అదిరిపోయే న్యూస్ చెప్పారు మర్వెల్ టీమ్. యుఎస్‌కి ఒక రోజు ముందు భారతదేశంలో విడుదల చేయడమే కాకుండా, మార్వెల్ స్టూడియోస్ థోర్: లవ్ అండ్ థండర్ సినిమాను జూలై 7 నుండి 4 రోజుల పాటు వరుసగా 96 గంటల పాటు ప్రదర్శనలను జరపనుంది. ఈ చిత్రం 4 రోజుల పాటు ఎంపిక చేసిన థియేటర్లలో 96 గంటల పాటు కొనసాగుతుంది, జూలై 7న 12:15 AM నుండి జూలై 10న 23:59 వరకు ఈమూవీ ప్రదర్శించనున్నారు. ఆస్కార్ విజేత తైకా వెయిటిటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మనకు ఇష్టమైన అవెంజర్ థోర్ గా క్రిస్ హేమ్స్‌వర్త్‌ తో పాటు భారీ తారాగణం: టెస్సా థాంప్సన్, నటాలీ పోర్ట్‌మన్, క్రిస్టియన్ బేల్ నటించారు. థోర్: లవ్ అండ్ థండర్ భారతదేశంలో జూలై 7న (యుఎస్ విడుదలకు ఒక రోజు ముందు) ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషలలో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..