AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas : కొత్త అవతారమెత్తనున్న ప్రభాస్.. ఆ సినిమా కోసం ఇలా మారనున్నాడట..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికే సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు ప్రభాస్

Prabhas : కొత్త అవతారమెత్తనున్న ప్రభాస్.. ఆ సినిమా కోసం ఇలా మారనున్నాడట..
Prabhas
Rajeev Rayala
|

Updated on: Aug 17, 2022 | 6:10 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికే సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు ప్రభాస్. రీసెంట్ గా వచ్చిన రాధేశ్యామ్ సినిమా నిరాశపరచడంతో డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు సలార్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దాదాపు 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమాతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. అలాగే నాగ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కే అనే సినిమా కూడా చేస్తున్నాడు డార్లింగ్. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

ఇదిలా ఉంటే ప్రభాస్ సక్సెస్ ఫుల్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఈ సినిమా గురించి ఎదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ను అనుకుంటున్నారని టాక్. ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ కు 50 కోట్లు రెమ్యునరేషన్ కూడా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించకపోవడంతో దానయ్య వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. దానయ్య తప్పుకోవడంతో ప్రభాస్ ఈ సినిమాను నిర్మించాలని అనుకుంటున్నారట. ప్రభాస్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూ.. హీరోగానూ నటించనున్నారని ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చెక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తలో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..

ఇవి కూడా చదవండి
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ