AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ormax Rankings: ఇండియన్ స్క్రీన్‌పై టాలీవుడ్ హవా.. నెంబర్ 1 ప్లేస్‌లో ‘రెబల్‌స్టార్’! మహేష్, అల్లు అర్జున్ ఎన్నో ప్లేస్‌లో ఉన్నారో తెలుసా

భారతీయ సినీ పరిశ్రమలో హీరోల క్రేజ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు ప్రాంతీయ భాషలకే పరిమితమైన మన స్టార్ హీరోలు, ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్నారు. అయితే ఈ స్టార్ హీరోలందరిలో దేశవ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో ఉన్నది ఎవరు?

Ormax Rankings: ఇండియన్ స్క్రీన్‌పై టాలీవుడ్ హవా.. నెంబర్ 1 ప్లేస్‌లో ‘రెబల్‌స్టార్’! మహేష్, అల్లు అర్జున్ ఎన్నో ప్లేస్‌లో ఉన్నారో తెలుసా
Prabhas And Ormax
Nikhil
|

Updated on: Jan 20, 2026 | 11:53 AM

Share

ఎవరి గురించి సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతోంది? ఎవరి ఫాలోయింగ్ శిఖరాగ్రాన ఉంది? అనే విషయాలను ప్రతి నెలా ఓర్మాక్స్ మీడియా సంస్థ విశ్లేషిస్తుంది. తాజాగా డిసెంబర్ నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ మేల్ ఫిల్మ్ స్టార్స్ జాబితా బయటకు వచ్చింది. ఇందులో తెలుగు హీరోలు తమ ఆధిపత్యాన్ని చాటుకోగా, ఒకప్పటి అగ్ర హీరోలు కొందరు కింది స్థానాలకు పడిపోయారు. మరి ఈ రేసులో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న ఆ గ్లోబల్ స్టార్ ఎవరు? మిగిలిన హీరోల రేటింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

నెంబర్ 1 స్థానంలో ప్రభాస్..

ఇండియాలోనే మోస్ట్ పాపులర్ మేల్ ఫిల్మ్ స్టార్‌గా రెబల్ స్టార్ ప్రభాస్ తన నెంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. గత కొంత కాలంగా ఆయన్ని టచ్ చేసే వారే లేరని చెప్పవచ్చు. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తుండటం, దేశవ్యాప్తంగా ఆయన సినిమాలపై చర్చ జరగడం ప్రభాస్‌కు ప్లస్ అయ్యింది. ఇటీవల ‘ది రాజా సాబ్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్, బాక్సాఫీస్ ఫలితంతో సంబంధం లేకుండా తన ఇమేజ్‌ను కాపాడుకుంటున్నారు. ఆయన సినిమాల అప్‌డేట్స్ కోసం దేశవ్యాప్త అభిమానులు ఎదురుచూస్తుండటం ప్రభాస్‌ను అగ్రపీఠాన నిలబెట్టింది.

విజయ్, షారూఖ్ ఖాన్ హవా..

ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన జాబితాలో రెండో స్థానంలో కోలీవుడ్ దళపతి విజయ్ నిలిచారు. గత కొన్ని నెలలుగా ఆయన తన స్థానాన్ని పదిలంగా కాపాడుకుంటున్నారు. విజయ్ నటించిన ‘జన నాయకుడు’ విడుదల విషయంలో కొన్ని చట్టపరమైన ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇక మూడో స్థానంలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నిలిచారు. విజయ్, షారూఖ్ ఇద్దరూ తమ స్థానాల్లో స్థిరంగా కొనసాగుతూ నేషనల్ లెవల్లో తమ ప్రభావాన్ని చూపిస్తున్నారు.

Allu Arjun & Mahesh Babu

Allu Arjun & Mahesh Babu

నాలుగో స్థానంలో ఐకాన్ స్టార్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాల్గో స్థానంలో నిలిచారు. **’పుష్ప 2’** తో ఇండియన్ బాక్సాఫీసును షేక్ చేసిన అల్లు అర్జున్, ఇప్పుడు తమిళ డైరెక్టర్ అట్లీతో చేయబోయే సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఏఏ22’ తో వార్తల్లో నిలుస్తున్నారు. లోకేష్ కనగరాజ్‌తో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించడం కూడా ఆయన పాపులారిటీని పెంచింది.

మహేష్ బాబు సెన్సేషన్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఐదో స్థానంలో నిలవడం విశేషం. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ‘వారణాసి’ కాన్సెప్ట్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుండి మహేష్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ సినిమా గ్లోబల్ ప్రాజెక్ట్ కావడంతో మహేష్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఆరో స్థానంలో అజిత్ కుమార్ నిలిచారు. అయితే విచారకరమైన విషయం ఏంటంటే, ఎప్పుడూ టాప్ లిస్ట్ లో ఉండే పవన్ కళ్యాణ్ పేరు ఈసారి టాప్ 10 జాబితాలో కనిపించలేదు.

రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల సినిమాల సందడి తగ్గడమే దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓర్మాక్స్ మీడియా జాబితా ప్రకారం, ఇండియన్ సినిమాలో టాలీవుడ్ హీరోల హవా నడుస్తోందని స్పష్టమవుతోంది. టాప్ 5 లో ముగ్గురు తెలుగు హీరోలు ఉండటం టాలీవుడ్​ సాధించిన విజయానికి నిదర్శనం.