AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇరాన్ లో పరిస్థితి దారుణం.. క్షేమంగా స్వదేశానికి చేరుకున్న ప్రవాసులు

ఇరాన్ లో పరిస్థితి దారుణం.. క్షేమంగా స్వదేశానికి చేరుకున్న ప్రవాసులు

Phani CH
|

Updated on: Jan 19, 2026 | 9:37 PM

Share

ఇరాన్‌లో తీవ్రమవుతున్న అల్లర్ల నేపథ్యంలో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర విదేశాంగ శాఖ సురక్షితంగా స్వదేశానికి తరలించింది. తొలివిడతలో ఢిల్లీకి చేరుకున్న పౌరులు, అక్కడి దయనీయ పరిస్థితులను వివరించారు. భద్రత కల్పించినందుకు మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 9,000 మంది భారతీయుల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటామని విదేశాంగ శాఖ హామీ ఇచ్చింది.

అల్లర్లతో ఇరాన్‌ అట్టుడుకుతోంది. అక్కడి పరిస్థితులు మరింత క్షీణించడంతో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను విదేశాంగ శాఖ సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చింది. తొలివిడతలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి తర్వాత పలువురు భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం వారు ఇరాన్‌లో పరిస్థితుల గురించి మీడియాకు వివరించారు. భారత ప్రభుత్వం జారీ చేసిన సూచనల నేపథ్యంలో శుక్రవారం రాత్రి వారు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో తమను సురక్షితంగా తీసుకొచ్చినందుకు వారు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్‌లో ఎక్కడ చూసినా ఆందోళనకారులే ఉన్నారని.. ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితులే లేవన్నారు. వీధుల్లో నిరసనకారుల మృతదేహాలు, ప్రజల హాహాకారాలతో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. భారత ప్రభుత్వం, రాయబార కార్యాలయం తమను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశాయన్నారు. ఇంటర్నెట్ లేకపోవడంతో మూడు రోజులుగా కుటుంబ సభ్యులతో మాట్లాడలేకపోయామని, బయటకు వెళ్తే నిరసనకారులు అడ్డుకోవడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యామన్నారు. తమ వారి కోసం విమానాశ్రయానికి చేరుకున్న కుటుంబసభ్యులు ఏం చెప్పారంటే.. చాలా రోజులుగా తమ వారితో ఎటువంటి సంప్రదింపులు లేవన్నారు. ఇరాన్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో వారి పరిస్థితిపై తాము ఆందోళన చెందామని.. కానీ మోదీ ప్రభుత్వం చొరవతో తమ కుటుంబసభ్యులు తిరిగి వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ఏం చెప్పారంటే.. ఇరాన్‌లో విద్యార్థులు సహా సుమారు 9,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. వారి సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుతం వాణిజ్య విమానాల ద్వారా పౌరుల తరలింపును సులభతరం చేస్తూ, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్రిమినల్‌ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

Gold Price Today: ట్రంప్‌ ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన బంగారం, వెండిధరలు!

వణుకు పుట్టిస్తున్న పొగమంచు.. హైవేపై హెవీ ట్రాఫిక్‌ జామ్‌

గొర్రె రక్తానికి అంత పవర్ ఉందా.. అసలు నిజాలు తెలిస్తే షాకవుతారు

ఎండు చేపలను ఇష్టంగా తింటున్నారా.. డేంజర్‌ సుమా