వణుకు పుట్టిస్తున్న పొగమంచు.. హైవేపై హెవీ ట్రాఫిక్ జామ్
ఆంధ్రప్రదేశ్‌లో పొగమంచు తీవ్రంగా ఉంది, ఆరు జిల్లాలకు ఫాగ్ అలర్ట్ జారీ అయింది. విజయవాడ-హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది, గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానాలు ఆలస్యమయ్యాయి. వాహనదారులు ఫాగ్‌లైట్లు వాడి నెమ్మదిగా వెళ్లాలి, ఉదయం 8 వరకు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అధికారులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
మంచే కదా అని లైట్‌గా తీసుకోవద్దు. ఫాగ్ లైట్ వాడకపోతే వెహికల్ జారి లైఫ్ గల్లంతవుతుంది. పొగమంచు తీవ్రత ఆ స్థాయిలో వుంది. ఏపీలో ఆరు జిల్లాలకు ఫాగ్ అలర్ట్స్ జారీ అయ్యాయి. సంక్రాంతి సంబరాలకు తెరపడింది, పందాల జోష్ సద్దు మణిగింది. కానీ చలి..పులిలా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పండగ సందడి నుంచి పట్నం బాట పట్టిన వాళ్లు పొగమంచు ధాటికి విలవిల్లాడుతున్నారు. దుప్పటి కప్పినట్టుగా పొగమంచు కమ్మేయడంతో విజయవాడ టు హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లపైనే కాదు ఆకాశమార్గంలోనూ ఇదే పరిస్థితి. పొగమంచు కారణంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు దారి కన్పించక కొన్ని విమానాలు చాలా సేపటి వరకు గాల్లో చక్కర్లు కొట్టాయి. విమానాల సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ఫాగ్ లైట్లను వేసుకొని నెమ్మదిగా వెళ్లాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. సోమవారం ఆరు జిల్లాల్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి జిల్లా, ఈస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పొగ మంచు ప్రభావం ఎక్కువగా వుంటుందన్నారు. ఇక పాడేరు ఏజెన్సీలో చలి బీభత్సంగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌లో రికార్డవుతున్నాయి. అయినా పర్యాటకుల రద్దీ పెరుగుతూనే ఉంది. ఇక మబ్బు మసకేయడంతో ఏపీలో చాలా చోట్ల ట్రాఫిక్ చుక్కలు చూపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో విజిబిలిటీ 300 మీటర్లకు పడిపోతుంది. ఉదయం 8 గంటల వరకు వాహనాల్లో బయటకు వెళ్లకపోవడమే మంచిదంటున్నారు. ఒక వేళ వెళ్లక తప్పని పరిస్థితి వుంటే…తప్పనసరిగా ఫాగ్ లైట్లను వాడుతూ తక్కువ స్పీడ్‌తో వెళ్లాలని సూచిస్తున్నారు అధికారులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గొర్రె రక్తానికి అంత పవర్ ఉందా.. అసలు నిజాలు తెలిస్తే షాకవుతారు
ఎండు చేపలను ఇష్టంగా తింటున్నారా.. డేంజర్ సుమా
Deepika Padukone: 40 ఏళ్లలో ఫిట్‌గా దీపిక.. రోజూ భోజనంలో ఇవి ఉండాల్సిందే
జుట్టు రాలిపోతోందా.. ఈ డ్రింక్ ట్రై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు

