పవిత్ర సోమవారం అక్కడ నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు..!
నెల్లూరు చెర్లోపల్లి విశ్వనాథ స్వామి ఆలయంలో సోమవారం, కార్తీక మాసంలో నాగుపాము భక్తులకు దర్శనమివ్వడం దైవ మహిమగా భావిస్తున్నారు. శివునికి ప్రీతిపాత్రమైన రోజున నాగేంద్రుడు కనిపించడంతో భక్తులు భక్తిపారవశ్యంతో పూజలు, శివనామస్మరణలు చేశారు. ఈ అద్భుత దృశ్యాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. ఇది శుభసూచకమని అక్కడి ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు.

ఆలయాల్లో నాగుపాము దర్శనమిస్తే భక్తులు దైవ మహిమగా భావిస్తుంటారు.. అందులోనూ శివుడికి ముఖ్యమైన సోమవారం నాడు ఆ ఆలయంలో ఉంటున్న నాగేంద్రుడు దర్శనం ఇస్తే మంచి జరుగుతుందని అక్కడి ప్రజల్లో గట్టి నమ్మకం ఏర్పడింది. ఇటీవల కార్తీక మాసంలో కూడా పలు సందర్భాల్లో ఆలయంలో నాగరాజు కనబడడం తో ఆ అద్భుతాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. శివాలయంలో నాగుపాము దర్శనమిస్తే భక్తులు కార్యకర్తగా మహిమ అని నమ్ముతూ ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇంతకీ ఆ విశేష ఆలయం ఎక్కడ ఉందో పూర్తి వివరాల్లోకి వెళితే..
నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి విశ్వనాథ స్వామి ఆలయంలో అద్భుతం జరిగింది. శివుడికి ఎంతో ప్రీయమైన సోమవారం రోజున ఆలయంలో నాగుపాము భక్తులకు దర్శనమిచ్చింది.. ఆలయానికి వచ్చిన భక్తులు నాగుపామును చూసి పూజలు చేసిన కాసేపటికి తిరిగి పుట్టలోకి వెళ్లిపోయిందని, ఆలయానికి వచ్చిన భక్తులు, ఆలయ అర్చకులు చెబుతున్నారు.. సోమవారం సందర్భంగా విశేష పంచామృత రుద్రాభిషేకం నిర్వహించారు కొందరు భక్తులు.
వీడియో ఇక్కడ చూడండి..
భక్తులు స్వామివారి దర్శనానికై వచ్చిన సమయంలోనే నాగేంద్రుడు విశ్వనాథ స్వామి వారిపై దర్శనమివ్వడంతో వందలాదిగా వచ్చిన భక్తులు పరవశించి పోయారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఆలయ ప్రాంగణం అంతా శివనామ స్మరణలతో మార్మోగిపోయింది. ఆలయ అర్చకులు శ్రీనివాసులు అక్కడ ఉన్న భక్తులు ఇదంతా వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్‌గా మారాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




