వరి పొలం మధ్యలో వింత బావి.. ఆ నీరు దివ్యౌషధంగా తాగిన ప్రజలు..! కట్‌చేస్తే…
సోషల్ మీడియాలో ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో ఒక ప్రాంతంలో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. అకస్మాత్తుగా భూమిలో ఒక సింక్ హోల్ కనిపించింది. మొదట, స్థానికులు దానిని దైవిక సంఘటనగా భావించారు. దానిలోని నీరు దివ్యౌషధంగా భావించి ఆ నీటిని తాగడం ప్రారంభించారు. కానీ తరువాత తెలిసిన షాకింగ్ న్యూస్ ఇప్పుడు వారికి ఫ్యూజులు అవుట్ అయ్యేలా చేసింది.

సోషల్ మీడియాలో ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో ఒక ప్రాంతంలో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. అకస్మాత్తుగా భూమిలో ఒక సింక్ హోల్ కనిపించింది. మొదట, స్థానికులు దానిని దైవిక సంఘటనగా భావించారు. దానిలోని నీరు దివ్యౌషధంగా భావించి ఆ నీటిని తాగడం ప్రారంభించారు. కానీ తరువాత తెలిసిన షాకింగ్ న్యూస్ ఇప్పుడు వారికి ఫ్యూజులు అవుట్ అయ్యేలా చేసింది. స్థానిక పరిపాలనా యంత్రాంగం తదుపరి చర్యలు చేపట్టింది. వారు పరిస్థితిని ప్రజలకు వివరించి, ఎవరూ దాని వద్దకు రాకుండా ఆ ప్రాంతం చుట్టూ కంచెను ఏర్పాటు చేశారు. ఇంతకీ ఆ సింక్‌హోల్‌కి కారణం ఏంటి..? ఆ నీటిలో ఏముంది..? పూర్తి వివరాల్లోకి వెళితే…
ఇండోనేషియాలోని సుమత్రా ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. అక్కడ సహజంగానే ఒక అద్భుతమైన సింక్ హోల్ ఏర్పడింది. ఇది ఆకస్మికంగా ఏర్పడటం వల్ల, దాని నీరు ఔషధ గుణాలను కలిగి ఉంటుందని ప్రచారం జరిగింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి సింక్ హోల్ నీటిని తాగటం ప్రారంభించారు. కానీ, ఆ తరువాతే తెలిసింది వారికి ఆ నీరు ఔషధం కాదు విషమని. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. పరిస్థితిని ప్రజలకు వివరించి ఆ నీటిని ఎవరూ తాగకుండా అడ్డుకున్నారు. కానీ, అప్పటికే చాలా మంది ప్రజలు ఆ నీటిని తాగేశారు. కొందరు వాటిని బాటిళ్లలో నింపుకుని తమ ఇళ్లకు తీసుకువెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, పోస్ట్‌లు ఆన్‌లైన్‌లో వేగంగా వైరల్‌గా మారాయి.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
పశ్చిమ సుమత్రాలోని వరి పొలాల మధ్యలో ఈ సింక్‌హోల్ ఏర్పడింది. భారీ వర్షపాతం వల్ల ఏర్పడిన భౌగోళిక మార్పుల ఫలితంగా ఈ సింక్‌హోల్ ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ సింక్‌హోల్‌లోని నీరు ఔషధపరమైనది కాకపోవచ్చు, కానీ అది ఖచ్చితంగా అపరిశుభ్రమైనదిగా సంబంధిత అధికారులు వెల్లడించారు. నీటిని పరీక్షించిన తర్వాత, స్థానిక అధికారులు అందులో కడుపు సంబంధిత వ్యాధులకు కారణమయ్యే E. coli అనే బ్యాక్టీరియా ఉందని కనుగొన్నారు.
జియోలాజికల్ ఏజెన్సీ, స్థానిక ఆరోగ్య శాఖల నుండి వచ్చిన నివేధికల ఆధారంగా ప్రజల్ని అలర్ట్ చేశారు అధికారులు. ఇక్కడి నీరు ఏమాత్రం సురక్షితం కాదని, ఎవరూ ఎటువంటి అసరాల కోసం కూడా ఈ నీటిని ఉపయోగించకూడదని హెచ్చరించారు. కానీ, ఈ సింక్ హోల్ వీడియో చూసేందుకు ఎంతో ప్రత్యేకంగా, అద్భుతంగా కనిపిస్తుంది. దీన్ని చూసి ప్రకృతిలో మారుతున్న స్వభావాన్ని అర్థం చేసుకోండి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




