AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office: కేవలం రూ.200తో రూ.10లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారిని చేసే ఈ పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసా..?

డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే.. దాన్ని జాగ్రత్తగా దాచుకుని రెట్టింపు చేసుకోవడం మరో ఎత్తు. షేర్ మార్కెట్ రిస్క్, ప్రైవేట్ చిట్టీల భయం వద్దు అనుకునే వారికి పోస్టాఫీస్ ఒక భరోసా. కేవలం మీ రోజువారీ ఖర్చుల నుంచి రూ. 200 ఆదా చేయగలిగితే, కొన్నేళ్లలో మీ చేతికి ఏకంగా రూ. 10 లక్షలకు పైగా నగదు వచ్చే అద్భుతమైన అవకాశం అందుబాటులో ఉంది.

Post Office: కేవలం రూ.200తో రూ.10లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారిని చేసే ఈ పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసా..?
Post Office Rd Scheme
Krishna S
|

Updated on: Jan 20, 2026 | 11:31 AM

Share

నేటి కాలంలో పెట్టుబడి పెట్టడానికి మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ వంటి అనేక మార్గాలు ఉన్నప్పటికీ సామాన్యులు ఇప్పటికీ పోస్టాఫీస్ పథకాలనే ఎక్కువగా నమ్ముతారు. దానికి కారణం ప్రభుత్వ గ్యారెంటీ, పెట్టుబడికి ఉండే పూర్తి భద్రత. తాజాగా పోస్టాఫీస్ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ పథకం ద్వారా చిన్న మొత్తంలో పొదుపు చేస్తూ లక్షాధికారి కావొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఏమిటి ఈ పోస్టాఫీస్ RD పథకం?

పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ అనేది ఒక చిన్న పొదుపు పథకం. దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుంది. కాబట్టి మీ డబ్బుకు 100శాతం భద్రత ఉంటుంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా మీరు డిపాజిట్ చేసిన సొమ్ముపై ప్రభుత్వం నిర్ణయించిన స్థిరమైన వడ్డీ లభిస్తుంది.

తక్కువ మొత్తంతోనే..

ఈ పథకంలో కేవలం రూ.100తోనే ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై 6.7శాతం వార్షిక వడ్డీ రేటు అమల్లో ఉంది. ఇందులో వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి లెక్కిస్తారు. దీనివల్ల మీ డబ్బు వేగంగా పెరుగుతుంది. ఖాతా తెరిచిన ఏడాది తర్వాత మీ డిపాజిట్‌పై 50 శాతం వరకు తక్కువ వడ్డీకే రుణం పొందే వెసులుబాటు ఉంది.

ఇవి కూడా చదవండి

రూ. 10 లక్షల నిధిని ఎలా ..?

మీరు రోజుకు రూ. 200 పొదుపు చేయగలిగితే అది నెలకు రూ. 6,000 అవుతుంది.

మొదటి 5 ఏళ్లు: నెలకు రూ. 6,000 చొప్పున 5 ఏళ్లలో మీరు చెల్లించే మొత్తం రూ. 3,60,000. 6.7శాతం వడ్డీతో కలిపి మీ చేతికి రూ. 4,28,197 వస్తాయి.

మరో 5 ఏళ్ల పొడిగింపు: మీరు ఈ పథకాన్ని మరో 5 ఏళ్లు (మొత్తం 10 ఏళ్లు) కొనసాగిస్తే మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం రూ. 7,20,000 అవుతుంది.

మెచ్యూరిటీ మొత్తం: 10 ఏళ్ల తర్వాత చక్రవడ్డీతో కలిపి మీకు సుమారు రూ. 10,25,131 అందుతాయి.

కేవలం రోజుకు రూ. 200 పొదుపు చేయాలనే క్రమశిక్షణ ఉంటే పదేళ్లలో మీ చేతిలో రూ. 10 లక్షలకు పైగా నగదు ఉంటుంది.

అత్యవసరమైతే ముందే తీసుకోవచ్చా?

సాధారణంగా ఈ పథకం కాలపరిమితి 5 ఏళ్లు. అయితే మీకు అత్యవసరంగా డబ్బు కావాలంటే 3 ఏళ్ల తర్వాత ఖాతాను క్లోజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. పిల్లల చదువులకైనా, పెళ్లిళ్లకైనా లేదా రిటైర్మెంట్ ప్లాన్ కోసమైనా.. రిస్క్ లేకుండా డబ్బు దాచుకోవాలనుకునే వారికి పోస్టాఫీస్ RD ఒక అద్భుతమైన వరం.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి