AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉల్లిపాయలు తింటే షుగర్ తగ్గుతుందా.. ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

Onions for diabetes: ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి మందులు, వ్యాయామంతో పాటు ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం. అయితే మన వంటగదిలో నిత్యం వాడే ఉల్లిపాయ డయాబెటిస్‌ను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Jan 20, 2026 | 8:50 AM

Share
మధుమేహం ఉన్నవారు ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల నిరంతరం హై-షుగర్ లెవల్స్‌తో ఇబ్బంది పడుతుంటారు. అయితే ది ఎండోక్రైన్ సొసైటీ నిర్వహించిన 97వ వార్షిక సమావేశంలో సమర్పించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఉల్లిపాయ సారం రక్తంలో చక్కెరను గణనీయంగా తగ్గిస్తుందని తేలింది.

1 / 5
పరిశోధనలో ఏం తేలింది?: ఎలుకలపై జరిపిన ఈ ప్రయోగంలో, డయాబెటిస్ మందు మెట్‌ఫార్మిన్‌తో పాటు ఉల్లిపాయ సారాన్ని కలిపి ఇచ్చినప్పుడు వాటి రక్తంలోని చక్కెర స్థాయిలు 50 శాతం వరకు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. కేవలం చక్కెర స్థాయిలే కాకుండా శరీరంలోని మొత్తం కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించడంలో ఉల్లిపాయ కీలక పాత్ర పోషించిందని వారు తెలిపారు.

2 / 5
ఉల్లిపాయ ప్రయోజనాలు: రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సహజంగా తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి, గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది. తక్కువ కేలరీలు ఉండే ఉల్లిపాయలు మెటబాలిజం రేటును పెంచి ఆకలిని నియంత్రించడంలో తోడ్పడతాయి.

3 / 5
ఎలా చేర్చుకోవాలి?: సలాడ్లు, శాండ్‌విచ్‌లు లేదా పెరుగు చట్నీలో పచ్చి ఉల్లిపాయ ముక్కలను చేర్చుకోవడం వల్ల పూర్తి పోషకాలు అందుతాయి. సూప్‌లు, కూరలు లేదా ఫ్రైస్ రూపంలో ఉల్లిపాయను వాడుకోవచ్చు. సైడ్ డిష్‌గా కాల్చిన ఉల్లిపాయలను తీసుకోవడం రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇంట్లో తయారుచేసే సాస్‌లలో ఉల్లిపాయ పేస్ట్‌ను కలిపి తీసుకోవచ్చు.

4 / 5
ఉల్లిపాయ సారం మెట్‌ఫార్మిన్ వంటి ఔషధాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది సరసమైనది, సులభంగా అందుబాటులో ఉండే ఆహార పదార్థం కాబట్టి డయాబెటిస్ మేనేజ్‌మెంట్‌లో దీనిని ఒక సహజ మిత్రుడుగా చెప్పొచ్చు. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. ఏదైనా మార్పులు చేసే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.

5 / 5