Mahesh Babu: సంక్రాంతి బరిలోకి దిగనున్న సూపర్ స్టార్.. మరోసారి ఆ బ్లాక్ బస్టర్ మూవీతో..
రోజు రోజుకు ట్రెండ్ మారుతోంది.. ఎప్పటికప్పుడు నయా ట్రెండ్స్ ఇండస్ట్రీలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పాత సినిమాలను ప్రెష్ గా 4కే క్వాలిటీతో రిలీజ్ చేస్తున్నారు.
రోజు రోజుకు ట్రెండ్ మారుతోంది.. ఎప్పటికప్పుడు నయా ట్రెండ్స్ ఇండస్ట్రీలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పాత సినిమాలను ప్రెష్ గా 4కే క్వాలిటీతో రిలీజ్ చేస్తున్నారు. స్టార్ హీరోల పుట్టిన రోజులకు ఆయా హీరోల సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో ఈ ట్రెండ్ మార్కెట్ లోకి వచ్చింది. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ హిట్ పోకిరి సినిమాను రీరిలీజ్ చేశారు. ఈ సినిమా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎన్ని సార్లు టీవీలో వచ్చినా మరోసారి థియేటర్స్ కు వెళ్లి ఎంజాయ్ చేశారు ఫాన్స్. దాంతో ఈ సినిమా రీరిలీజ్ లో భారీగానే వసూల్ చేసింది. అలాగే పోకిరితో పటు ఒక్కడు సినిమాను కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన జల్సా, తమ్ముడు సినిమాలను రిలీజ్ చేశారు. ఈ రెండు సినిమాలకు కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
త్వరలో ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన బిల్లా సినిమాను కూడా రీరిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ సినిమా మరోసారి రీరిలీజ్ కు రెడీ అవుతోంది. మహేష్ కెరీర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచినా ఒక్కడు సినిమాను మరోసారి రిలీజ్ చేయనున్నారు. 2023 జనవరి 8 నాటికి ‘ఒక్కడు’ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ‘ఒక్కడు’ సినిమాను రీరిలీజ్ చేయబోతున్నారు. అంటే సంక్రాంతి టైంకి సంక్రాంతి సమయానికి పెద్ద సినిమాల హడావిడి ఉంటుంది. ఇప్పుడు తన పాత బ్లాక్ బస్టర్ ను మరోసారి బరిలోకి దింపనున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మరి మహేష్ ఒక్కడు ఇప్పుడు ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.