AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: గణేష్ నిమజ్జనంలో సందడి చేసిన ఐకాన్ స్టార్.. కూతురితో కలిసి అల్లు అర్జున్ డ్యాన్స్..

ప్రస్తుతం ఈ ఊరేగింపుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Allu Arjun: గణేష్ నిమజ్జనంలో సందడి చేసిన ఐకాన్ స్టార్.. కూతురితో కలిసి అల్లు అర్జున్ డ్యాన్స్..
Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Sep 05, 2022 | 7:38 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. ప్రస్తుతం పుష్ప ది రూల్ షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే పలు యాడ్స్.. ఫ్యామిలీతో వెకేషన్ అంటూ బిజీ అయిన బన్నీ.. ప్రస్తుతం ఖాళీ సమయాన్ని కుటుంబంతో గడుపుతున్నారు. తాజాగా తన కూతురు అర్హతో కలిసి గణేష్ నిమజ్జనంలో సందడి చేశారు. జూబ్లీహిల్స్‏లో గీతా ఆర్ట్స్ సంస్థలో నెలకొల్పిన వినాయకుడికి సోమవారం వీడ్కోలు పలికారు. అయితే గణేష్ నిమజ్జనం సందర్భంగా తన కూతురు అర్హతో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గోన్నారు. అంతేకాకుండా.. ఇంట్లో అర్హ తయారు చేసిన వినాయక విగ్రహాలను సైతం తీసుకువచ్చారు. ఆ తర్వాత అర్హతో కలిసి స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ ఊరేగింపుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో ఊర మాస్ లుక్కులో కనిపించి అదరగొట్టాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సిక్వెల్ పుష్ప ది రూల్ రాబోతుంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్నా నటించగా.. మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ నటించారు.

ఇవి కూడా చదవండి

ట్విట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!