Ram Charan: సినిమాల్లోకి రాకముందు రామ్ చరణ్ ఎలా ఉండేవాడో తెలుసా.. వైరల్ అవుతోన్న ఓల్డ్ వీడియో
చరణ్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే నటనతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మగధీర సినిమాతో చరణ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇప్పుడు ఈ పేరు ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక చరణ్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే నటనతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మగధీర సినిమాతో చరణ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు చరణ్. తండ్రి పేరును వాడుకోకుండా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా దూసుకుపోతున్నాడు చరణ్. ఇదిలా ఉంటే చరణ్ సినిమాలోకి రాక ముందు ఎలా ఉండేవాడు.. అని కొందరు నెట్టింట గాలిస్తున్నారు. ఈ క్రమంలో చరణ్ కు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చరణ్ నటనలో శిక్షణ తీసుకుంటున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో చరణ్ తో పాటు హీరోయిన్ శ్రియ కూడా ఉన్నారు. ఇక ఈ వీడియోలో చరణ్ మీసాలు లేకుండా లాంగ్ హెయిర్ తో కనిపించాడు.
ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా పాపులారిటీ సొంతం చేసుకున్నారు చరణ్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.