Aadavaallu Meeku Johaarlu: ఓ మై ఆద్యా పాటకు భారీ రెస్పాన్స్.. శర్వా, రష్మిక వాలెంటైన్స్ ట్రీట్..

టాలెంటెడ్ హీరో శర్వానంద్ (Sharwanand) హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కి్స్తున్నాడు..

Aadavaallu Meeku Johaarlu: ఓ మై ఆద్యా పాటకు భారీ రెస్పాన్స్.. శర్వా, రష్మిక వాలెంటైన్స్ ట్రీట్..
Oh My Aadya
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 15, 2022 | 6:54 AM

టాలెంటెడ్ హీరో శర్వానంద్ (Sharwanand) హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కి్స్తున్నాడు.. మొదటి నుంచి శర్వానంద్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమా చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. గత కొంత కాలంగా శర్వా నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోతున్నాయి. ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు శర్వా.. ఈ క్రమంలోనే ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavaallu Meeku Johaarlu) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఈసారి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రానున్నాడు శర్వా. ఇందులో రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన ప్ర‌తి ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కు విశేష స్పంద‌న‌ ల‌భించింది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అవ్వడంతో ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా.. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ పెప్పీ అండ్ బ్రీజీ మెలోడీ ఓ మై ఆధ్య పాటను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ పాట‌లో దేవి శ్రీ ప్రసాద్ కొన్ని ఫుట్ ట్యాపింగ్ సౌండ్‌లను అందించారు. హీరోహీరోయిన్లు వారి డ్యాన్స్ స్కిల్స్ ప్రదర్శించడానికి తగినంత స్కోప్ పాట‌లో ఉంది. గిటార్ స్టెప్ మ‌రింత‌ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ పాటను యాజిన్ నిజార్ చక్కగా ఆలపించారు. శ్రీమణి మంచి సాహిత్యం అందించారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో శర్వానంద్ స్టైలిష్‌గా కనిపించగా, రష్మిక మందన్న గ్లామర్‌గా కనిపించింది. ఈ పాట యూత్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి సీనియ‌ర్ యాక్ట‌ర్స్‌ క‌లిసి న‌టిస్తుండ‌డం ఈ సినిమాలో మ‌రో విశేషం.సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా సినిమా బజ్‌ను మ‌రింత‌ పెంచడానికి సహాయపడుతోంది. ఇప్ప‌టికే సినిమా ఫస్ట్‌, టైటిల్‌ ట్రాక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. మొత్తానికి ఓ మై ఆద్యా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Also Read: Rudra: ఆద్యంతం ఉత్కంఠ భరితంగా రుద్ర వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌.. నటనతో ఆకట్టుకున్న రాశీ ఖన్నా..

Kalavathi Song: దూసుకుపోతున్న కళావతి సాంగ్‌.. సౌత్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీలోనే తొలి పాటగా..

Vijay Beast: విజయ్‌ బీస్ట్‌ నుంచి లిరికల్‌ సాంగ్‌.. అదిరిపోయే స్టెప్స్‌తో మరోసారి ఆకట్టుకున్న ‘బుట్టబొమ్మ’..

Upasana: ‘పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారనేది నిజం కాదు’.. వాలంటైన్స్‌డే రోజు ఆసక్తికరమైన వీడియోను షేర్‌ చేసిన ఉపాసన..