Bhavadeeyudu Bhagat Singh: పవన్ కల్యాణ్ సరసన ‘ఖిలాడీ’ లేడీ.. త్వరలో సెట్స్‌పైకి?

డైరెక్టర్ హరీష్ శంకర్- పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో తీస్తున్న సినిమా పేరు ''భవదీయుడు భగత్ సింగ్''. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. ఎప్పుడో అధికారిక ప్రకటన వచ్చినా..

Bhavadeeyudu Bhagat Singh: పవన్ కల్యాణ్ సరసన 'ఖిలాడీ' లేడీ.. త్వరలో సెట్స్‌పైకి?
Bhavadeeyudu Bhagat Singh Pawan Kalyan
Follow us
Venkata Chari

|

Updated on: Feb 15, 2022 | 7:05 AM

Bhavadeeyudu Bhagat Singh: డైరెక్టర్ హరీష్ శంకర్- పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కాంబోలో తీస్తున్న సినిమా పేరు ”భవదీయుడు భగత్ సింగ్”. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. ఎప్పుడో అధికారిక ప్రకటన వచ్చినా.. ఈ సినిమాపై ఎలాంటి అప్‌డేట్స్‌ లేవు. కరోనా పరిస్థితులే కావొచ్చు లేదా పవర్ స్టార్ బిజీ నేపథ్యంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేకపోయింది. పవన్ డేట్స్ కేటాయించిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంహించాలని మేకర్స్ యోచిస్తున్నారు.

కాగా, ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఇందులో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. అయితే, పూజా హెగ్డే హీరోయిన్‌గా ఈ సినిమాలో పవర్ స్టార్‌కు జోడీగా నటిస్తుందంటూ వార్తలు కూడా వినిపించాయి. అయితే తాజాగా మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో డైరెక్టర్ హరీష్ శంకర్ ఖిలాడీ ఫేం డింపుల్ హయాతీ నటిస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

Bhavadeeyudu Bhagat Singh Dimple Hayathi

ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసిన హీరోయిన్ డింపుల్ హయాతి పేరే మారుమ్రోగిపోతోంది. ఈమె నటించిన 3 సినిమాలు నెలకొకటి చొప్పున విడుదల అయ్యాయి. ఈ హీరోయిన్ డెబ్యూ మూవీ ‘అత్రాంగిరే’ డిసెంబర్ లో విడుదలయింది. ఆ తరువాత యంగ్ హీరో విశాల్ నటించిన ‘సామాన్యుడు’ ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలయింది. ఈ సినిమాలోనూ ఈమో హీరోయిన్‌గా నటించింది. ఇక తాజాగా రవితేజ ‘ఖిలాడీ’ సినిమాలోనూ ఈ హీరోయిన్ కనిపించింది. ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం విడుదలైంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Rudra: ఆద్యంతం ఉత్కంఠ భరితంగా రుద్ర వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌.. నటనతో ఆకట్టుకున్న రాశీ ఖన్నా..

Kalavathi Song: దూసుకుపోతున్న కళావతి సాంగ్‌.. సౌత్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీలోనే తొలి పాటగా..