NTR 100 Years Celebrations: ఎన్టీఆర్ శతజయంతోత్సవాలు.. ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ రజినీకాంత్..
ఈ కార్యక్రమంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, నటుడు రజనీకాంత్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎన్టీఆర్ ప్రసంగాలతో కూడిన పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. టీడీపీ ప్రస్థానం, తెలుగురాష్ట్రాల్లో ఎన్టీఆర్ ప్రభంజనంపై నేతలు ప్రసంగిస్తారు. సభా ప్రాంగణాన్ని మూడు భాగాలుగా విభజించారు. ‘ఎన్’ విభాగంలో విశిష్ఠ అతిథులు, ‘టి’ విభాగంలో అతిథులు, ‘ఆర్’ విభాగంలో సామాన్యులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. విజయవాడలోని పోరంకిలో అనుమోలు గార్డెన్స్‌లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు దాదాపు 10 వేల మంది హజరయ్యినట్లుగా తెలుస్తోంది. ఈరోజు ఉదయం సూపర్ స్టార్ రజినీకాంత్ విజయవాడకు చేరుకున్నారు. విమానాశ్రయంలో నటుడు బాలకృష్ణ పూలమాల వేసి ఆత్మీయ ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, నటుడు రజనీకాంత్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎన్టీఆర్ ప్రసంగాలతో కూడిన పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. టీడీపీ ప్రస్థానం, తెలుగురాష్ట్రాల్లో ఎన్టీఆర్ ప్రభంజనంపై నేతలు ప్రసంగిస్తారు. సభా ప్రాంగణాన్ని మూడు భాగాలుగా విభజించారు. ‘ఎన్’ విభాగంలో విశిష్ఠ అతిథులు, ‘టి’ విభాగంలో అతిథులు, ‘ఆర్’ విభాగంలో సామాన్యులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.