Sri Sri Sri Raja Vaaru: ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’గా ఎన్టీఆర్ బావమరిది .. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
టాలీవుడ్ లో కొత్త హీరోల ఎంట్రీలు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా మంది కొత్త కుర్రాళ్ళు తెలుగు తెరకు పరిచయం అయ్యి తమ సత్తా చాటుకుంటున్నారు.

Sri Sri Sri Raja Vaaru: టాలీవుడ్ లో కొత్త హీరోల ఎంట్రీలు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా మంది కొత్త కుర్రాళ్ళు తెలుగు తెరకు పరిచయం అయ్యి తమ సత్తా చాటుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో కుర్రాడు హీరోగా పరిచయం కానున్నాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు కుమారుడు నార్నే నితిన్ ఇలా అంటే గుర్తుపట్టడం కొంచం కష్టమే.. జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు నితిన్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఈ చిత్రానికి ‘శ్రీ శ్రీ శ్రీ రాజా వారు’ టైటిల్ ఖరారు చేశారు. శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్‌పై రామారావు చింతపల్లి మరియు ఎంఎస్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డు గెలుచుకుని ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వేగేశ్న సతీష్ దీనికి దర్శకత్వం వహించారు.
చిత్ర హీరో నితిన్ నటనలో పూర్తి శిక్షణ తీసుకున్న తరువాతే “శ్రీశ్రీశ్రీ రాజా వారు” వంటి విభిన్నమైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ప్రస్తుతం ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న సందర్భంగా తాజాగా హీరో నార్నే నితిన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆలయ ఉత్సవాల నేపథ్యంలో సృజనాత్మ కంగా రూపొందించిన పోస్టర్ లో సైడ్ పోజ్‌లో నార్నే నితిన్ కనిపించాడు. రెడ్ చెక్స్ ఫుల్ హ్యాండ్ షర్ట్, జీన్స్ ప్యాంట్, స్పోర్ట్స్ షూస్‌తో రగ్గడ్ లుక్‌లో ఉన్నాడు. జాతరలో స్టైల్‌గా సిగరెట్ వెలిగిస్తున్న నార్నే నితిన్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. అలాగే ఈ చిత్ర నిర్మాతలు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ చిత్ర దర్శకుడికి భద్రత పెంపు.. వై క్యాటగిరీ కల్పిస్తూ అధికారుల నిర్ణయం..Prabhas: మారుతి సినిమాకు ప్రభాస్ అన్ని కోట్లు తీసుకుంటున్నారా.? రోజుకు ఏకంగా కోటి రూపాయల పైమాటే..Bheemla Nayak Aha: ఆహాలో పవర్ స్ట్రోమ్.. స్ట్రీమింగ్కు సిద్ధమైన బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్..




