- Telugu News Photo Gallery Cinema photos Alia Bhatt Net Worth: Alia Bhatt also has a luxurious house in London, know how much is the net worth of the actress
Alia Bhatt Net Worth: 29 ఏళ్ల సీతమ్మకు సంపదను పెట్టుబడి పెట్టడం ఇష్టం.. ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్
అలియా భట్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో సీతగా తెలుగులోకూడా అడుగు పెడుతోంది. 29 ఏళ్ల ఈ బ్యూటీ సినీ నేపధ్య కుటుంబం నుంచి వచ్చింది. సంఘర్ష్ సినిమాలో బాలనటిగా నటించింది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అలియాది విలాసవంతమైన జీవితం.
Updated on: Mar 18, 2022 | 7:54 PM

ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు అలియా భట్. 'గంగూబాయి కతియావాడి'లో తన అద్భుతమైన నటనను ప్రదర్శించిన అలియా ఇప్పుడు 'బ్రహ్మాస్త్ర', 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రాల్లో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది.

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న అలియా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది. 29 ఏళ్లకే కొన్ని కోట్ల ఆస్తులకు ఆమె వారసురాలు. ఈ బబ్లీ నటి సంపద, ఆస్తుల ఎన్నికోట్లో తెలిస్తే అభిమానులు షాక్ తింటారు.

ఆన్‌లైన్ మీడియా కథనాల ప్రకారం అలియా భట్ ఆస్తుల నికర విలువ రూ.165 కోట్లు. బాంద్రాలో అలియాకు విలాసవంతమైన ఇల్లు ఉంది, దీని విలువ రూ. 32 కోట్లు.

ఆలియాకు కూడా లండన్‌లో ఇల్లు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ బబ్లీ బ్యూటీకి తన సంపాదనను భూములపై పెట్టుబడి పెట్టడం ఇష్టం. ఇటీవల అలియా జుహులో ఒక ఇల్లు కూడా కొనుగోలు చేసింది.

అలియాకు లగ్జరీ వాహనాలంటే కూడా ఇష్టం. అలియా రేంజ్ రోవర్, ఆడి A6 , BMW 7 సిరీస్‌లను కూడా కలిగి ఉంది. అంతేకాదు అలియాకు తన సొంత వ్యానిటీ వ్యాన్ కూడా ఉంది




