Nithiin: ఆ సినిమా ఆగిపోవడానికి అదే కారణం.. క్లారిటీ ఇచ్చిన నితిన్ తండ్రి
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం మాచర్ల నియోజక వర్గం అనే సినిమాలో నటిస్తున్నాడు నితిన్.

యంగ్ హీరో నితిన్(Nithiin) ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం మాచర్ల నియోజక వర్గం అనే సినిమాలో నటిస్తున్నాడు నితిన్. చెక్, మాస్ట్రో సినిమాలు నితిన్ అభిమానులను నిరాశపరిచాయి. రంగ్ దే సినిమా పర్లేదు అనిపించినా ఫ్యాన్స్ కు అది సరిపోలేదు.. దాంతో ఇప్పుడు మాచర్ల నియోజక వర్గం పైనే ఆశలు పెట్టుకున్నారు నితిన్ ఫ్యాన్స్. పొలిటికల్ డ్రామ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఆ మధ్య పవర్ పేట అనే సినిమాను అనౌన్స్ చేశాడు నితిన్.
నితిన్ సొంత బ్యానర్లో కృష్ణచైతన్య దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుందని పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత ఈ సినిమాగురించి ఎక్కడ ఊసే లేదు. దాంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమా గురించి మర్చిపోయారు. తాజాగా నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ.. ఆ సినిమాను ఆపేశాం అని తెలిపారు. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విక్రమ్ సినిమాను తెలుగులో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి రిలీజ్ చేశారు. ఈ సినిమా ఇక్కడ మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సందర్భంగా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ.. నితిన్ పవర్ పేట సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు. ఆ కథ ఫైనల్ వర్షన్ బాగా రాలేదు అని ఆపేశాం అని పేర్కొన్నారు. ఇక నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజక వర్గం సినిమాలో అందాల భామ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.




