Mahesh and Thalapathi Vijay : తమిళ్ స్టార్ హీరో కోసం రంగంలోకి సూపర్ స్టార్.. వంశీ పైడిపల్లి సినిమాలో..
స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

స్టార్ హీరో దళపతి విజయ్(Thalapathi Vijay) ప్రస్తుతం వంశీ పైడిపల్లి తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా సక్సెస్ దళపతి ఫ్యాన్స్ కు సరిపోలేదు.. తమ హీరో కు సాలిడ్ హిట్ కోరుకుంటున్నారు. దాంతో అభిమానుల ఆశలన్నీ వంశీ పైడిపల్లి సినిమా పైనే ఉన్నాయి. దిల్ రాజు నిర్మాతగా వ్యహస్తరిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే హైదరాబాద్ లో ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరుపుకుంది.. త్వరలోనే రెగ్యులర్ షూట్ ను మొదలు పెట్టనున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుందని టాక్ వినిపిస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న దళపతి 66 లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్నారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కీలక గెస్ట్ రోల్ లో మహేష్ కనిపించబోతున్నాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. వంశీ పైడిపల్లికి మహేష్ బాబు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. దాన్తోబ్ ఇప్పుడు విజయ్ సినిమాలో మహేష్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడని వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియదు కానీ వంశీ కోరితే తప్పకుండా మహేష్ బాబు నటించేందుకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయని అభిమానులు అంటున్నారు. మహేష్ ఇంతవరకు ఇతరుల సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించలేదు. ఈ వార్త నిజం అవ్వాలని అటు విజయ్ ఫ్యాన్స్ ఇటు మహేష్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి వంశీ కోసం విజయ్ సినిమాలో నటిస్తాడేమో చూడాలి.