Macherla Niyojakavargam: రిలీజ్ డేట్ మార్చుకున్న యంగ్ హీరో.. నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’లో అడుగు పెట్టేది అప్పుడే.

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ ఇటీవల వరుస సినిమాలతో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా రంగ్ దే సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ కుర్ర హీరో ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Macherla Niyojakavargam: రిలీజ్ డేట్ మార్చుకున్న యంగ్ హీరో.. నితిన్ 'మాచర్ల నియోజకవర్గం'లో అడుగు పెట్టేది అప్పుడే.
Macherla Niyojakavargam
Follow us
Rajeev Rayala

|

Updated on: May 08, 2022 | 7:13 PM

యంగ్ అండ్ వర్సటైల్ హీరో నితిన్(Nithiin)ఇటీవల వరుస సినిమాలతో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా రంగ్ దే సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ కుర్ర హీరో ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నితిన్ హీరోగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం'(Macherla Niyojakavargam). శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నితిన్ కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని ముందుగా జూలై 8న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే కొన్ని పనులు పెండింగ్ లో వుండటం చేత సినిమా వాయిదా పడింది. ఇప్పుడు ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రం కొత్త విడుదల తేది ఖరారైయింది.

ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే ఫెస్టివల్ కూడా ఈ చిత్రానికి కలసిరానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో నితిన్ లుక్ ఆకట్టుకుంది. బ్లూ జీన్స్ వైట్ షర్టులో టక్ చేసుకొని హాండ్స్ ని పోల్డ్ చేస్తున్న స్టిల్ లో నితిన్ సాలిడ్ గా కనిపించారు. స్టైలిష్ గా కనిపిస్తూనే మాస్ యాక్షన్ లుక్స్ తో దూకుడు చూపించాడు నితిన్. ప్రస్తుతం ఈ చిత్రంలోని పాటలని ఇటలీ, ఆస్ట్రియాలోని అందమైన ప్రదేశాలలో చిత్రీకరిస్తున్నారు. నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ , టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్, టీజర్ వీడియోలో నితిన్ మునుపెన్నడూ విధంగా డిఫరెంట్ యాక్షన్ లుక్ తో ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. పొలిటికల్ నేపధ్యంలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Nithin

ఇవి కూడా చదవండి

Megastar Chiranjeevi: మదర్స్‌ డే స్పెషల్‌.. అంజనమ్మతో మధుర క్షణాలను గుర్తుచేసుకున్న మెగా బ్రదర్స్..

T.Krishna: టీ. కృష్ణలు వేర్వేరు అని తెలియక కలగాపులగం చేసి పారేశారు

Prabhas: ప్రభాస్‌ కోసం మరో బాలీవుడ్‌ బ్యూటీని దింపుతోన్న చిత్ర యూనిట్‌.. అధికారిక ప్రకటన..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి