Adipurush: ఆ మాత్రం తెలియకుండా ఎలా సినిమా తీశావ్ గురూ.. ఆదిపురుష్ పై మరో వివాదం
ఇప్పటికే చాలా మంది ఈ సినిమా పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో ఈ మూవీ పై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ రిలీజ్ అయిన దగ్గర నుంచి దీని పై వివాదాలు వస్తూనే ఉన్నాయి.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా పై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో అదే స్థాయిలో వివాదాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది ఈ సినిమా పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో ఈ మూవీ పై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ రిలీజ్ అయిన దగ్గర నుంచి దీని పై వివాదాలు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్ లుక్ శివుడి ఫోటోల నుంచి కాపీ చేశారని ఆరోపించారు కొందరు. అందుకు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ కూడా చేశారు. ఇక ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు గ్రాఫిక్స్ విషయంలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. ఆ తర్వాత ఆది పురుష్ త్రిడీ టీజర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత రావణాసురిడి పాత్రలో నటించిన సైఫ్ కు గడ్డం ఉండటం పై కూడా ట్రోల్స్ చేశారు.
తాజాగా విడుదలైన ట్రైలర్ పై కూడా నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ లో రావణుడు సీతమ్మను ఎత్తుకెళ్లే సీన్ ను చూపించారు. అయితే పర్ణశాల నుంచి రావణుడు సీతమ్మను తాకకుండా ఆమె నిలబడ్డ స్థానంలో భూమితో సహా తీసుకెళ్తాడు. ఇదే మన పురాణంలో ఉంది. ఇప్పటి వరకు వచ్చిన రామాయణ సినిమాల్లోనూ అదే చూపించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన రామదాసు సినిమాలోనూ అదే చూపించారు.ఇక పర్ణశాల లో రావణుడు సీతమ్మను ఎత్తుకెళ్లిన జాడలు కూడా ఉన్నాయి.
కానీ ఆదిపురుష్ లో మాత్రం అలా చూపించలేదు. ఏకంగా గాలిలోనే సీతమ్మను రావణుడు ఎత్తుకెళ్లినట్టు చూపించారు. దాంతో నెటిజన్స్ దీని పై ట్రోల్స్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా దేనికి పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మాత్రం రామాయణం తెలియకుండా సినిమా ఎలా తీశావ్ అంటూ కొందరు. మరికొందరు చూసుకోవాలి కదా గురూ అని కామెంట్స్ చేస్తున్నారు.