Siddharth: అభిమానం కాదు.. అంతకు మించి.. పాదాలకు నమస్కరించి వెక్కి వెక్కి ఏడ్చేసిన సిద్ధార్థ్..
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్‌గా ఓ వెలుగు వెలిగిన హీరో సిద్ధార్థ్. అందమైన ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. నువ్వొస్తానంటే నేనొద్దాంటానా, బొమ్మరిల్లు, బాయ్స్ వంటి హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ హీరో.. అంతే తక్కువ సమయంలో స్టార్ డమ్ కోల్పోయాడు.

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్‌గా ఓ వెలుగు వెలిగిన హీరో సిద్ధార్థ్. అందమైన ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. నువ్వొస్తానంటే నేనొద్దాంటానా, బొమ్మరిల్లు, బాయ్స్ వంటి హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ హీరో.. అంతే తక్కువ సమయంలో స్టార్ డమ్ కోల్పోయాడు. అప్పటివరకు ప్రేమకథా చిత్రాలే సూపర్ హిట్ అయినా.. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద సిద్ధార్థ్ నటించిన సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఈహీరోకు అవకాశాలు తగ్గిపోవడంతో చాలా కాలం వెండితెరకు దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే మాస్ యాక్షన్ చిత్రాలతో మరోసారి థియేటర్లలో సందడి చేస్తున్నారు. శర్వానంద్, సిద్ధార్థ్ కలిసిన నటించిన మహాసముద్రం సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఆయన టక్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దార్థ్ మధ్యలోనే వెక్కి వెక్కి ఏడ్చేశాడు. అందుకు కారణం కూడా ఉంది. ఇటీవల సిద్ధార్థ్ ఇంటర్వ్యూలో ఉండగా.. ఆకస్మాత్తుగా అక్కడకు తమిళ్ సినీ పరిశ్రమకు చెందిన సుజాత రంగరాజన్ వచ్చారు. అక్కడ ఆమెను చూసిన సిద్ధార్థ్ భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే ఆమె పాదాలకు నమస్కరించి ఆ తర్వాత గట్టిగా పట్టుకొని ఏడ్చేశాడు. ఎందుకంటే.. బాయ్స్ సినిమాకు హీరోగా సిద్ధార్థ్ సరిగ్గా సరిపోతాడని.. అతడిని హీరోగా తీసుకోవాలని సుజాత రంగరాజన్ డైరెక్టర్ శంకర్ ను రిక్వెస్ట్ చేశారట. ఆమె మాట ప్రకారం దర్శకుడు శంకర్ సిద్ధార్థ్ కు ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా.. హీరోగా అతడి కెరీర్ టర్న్ అయ్యింది. అందుకే ఆమెను చూడగానే సిద్దార్థ్ భావోద్వేగానికి గురయ్యారు.
ఇదిలా ఉంటే.. సిద్ధార్థ్ ఇప్పుడు మరోసారి డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 చిత్రంలో సిద్ధార్థ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులో కాజల్ కథానాయికగా నటిస్తుంది.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.