AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush Vs Nayanthara: నయనతారపై కేసు పెట్టిన ధనుష్.. వ్యవహారం ఎటు వెళ్తుందో..?

ధనుష్, నయనతార మధ్య వివాదం మరింత ముదురుతుంది. ఓ ప్రముఖ ఓటిటిలో వచ్చిన నయన్ డాక్యుమెంటరీతో మొదలైన వివాదం కాస్తా మరింత ముందుకు వెళ్తుందిప్పుడు. హీరోయిన్‌ నయనతార, ఆమె భర్త విఘ్నేష్‌ శివన్‌‌పై మద్రాస్‌ హైకోర్టులో సివిల్‌ కేసు దాఖలు చేశారు ధనుష్.

Dhanush Vs Nayanthara: నయనతారపై కేసు పెట్టిన ధనుష్.. వ్యవహారం ఎటు వెళ్తుందో..?
Danush Nayanathara
Praveen Vadla
| Edited By: Janardhan Veluru|

Updated on: Nov 27, 2024 | 4:03 PM

Share

ధనుష్, నయనతార మధ్య వివాదం మరింత ముదురుతుంది. ఓ ప్రముఖ ఓటిటిలో వచ్చిన నయన్ డాక్యుమెంటరీతో మొదలైన వివాదం కాస్తా మరింత ముందుకు వెళ్తుందిప్పుడు. హీరోయిన్‌ నయనతార, ఆమె భర్త విఘ్నేష్‌ శివన్‌‌పై మద్రాస్‌ హైకోర్టులో సివిల్‌ కేసు దాఖలు చేశారు ధనుష్. తన అనుమతి లేకుండా నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీలో ‘నానుమ్‌ రౌడీ ధాన్‌’ సినిమాకు సంబంధించిన విజువల్స్‌ వాడుకున్నారని పేర్కొన్నారు. ‘వండర్‌ బార్ ఫిల్మ్స్‌’ బ్యానర్‌పై ధనుష్‌ ‘నానుమ్‌ రౌడీ ధాన్‌’ సినిమాను నిర్మించారు. ఈ విషయంపైనే ధనుష్, నయనతార మధ్య వివాదం మొదలైంది. నోటీసులు పంపిన తర్వాత ధనుష్‌‌పై బహిరంగ విమర్శలు చేసారు నయన్. దాంతో వివాదం ఇంకాస్త పెద్దదైంది.

తన అనుమతి లేకుండా విజువల్స్ వాడుకున్నందుకు రూ.10 కోట్లకు లీగల్‌ నోటీసులు పంపారు ధనుష్. నయన్ దంపతులపై ధనుష్ వేసిన పిటీషన్‌ను పరీశీలించిన ధర్మాసనం విచారణకు అంగీకరించింది. ఇదంతా చూసిన ఫ్యాన్స్.. అసలు ధనుష్, నయనతార మధ్య ఏం జరుగుతుంది..? ఈ ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది..? అసలెందుకు ధనుష్‌పై నయనతార అన్ని ఎలిగేషన్స్ చేస్తున్నారు..? కేవలం డాక్యుమెంటరీనే ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలకు కారణమా..? లేదంటే ఇంకా లోలోపల గొడవలేమైనా ఉన్నాయా..? అంటూ ఆరాలు తీస్తున్నారు. అన్నింటికి మించి మొన్న ధనుష్‌పై నయనతార రిలీజ్ చేసిన లెటర్ సంచలనంగా మారింది. ఇది మనసులో పెట్టుకునే ధనుష్ ఇప్పుడు కోర్టులో నయన్ దంపతులపై పిటిషన్ దాఖలు చేశారంటున్నారు నిపుణులు.

లెటర్‌లో ధనుష్ వ్యక్తిత్వంపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు నయన్. పైకి ఒకలా.. లోపల మరోలా ఉంటాడని.. ఎవరైనా ఎదిగితే చూసి ఓర్చుకోలేడని మండిపడ్డారు నయన్. ఇదంతా ఓ ప్రముఖ ఓటిటిలో నయనతార డాక్యుమెంటరీ చేయడంతో వచ్చింది. అందులో నానుం రౌడీధాన్ సినిమాకు సంబంధించిన 3 సెకన్ల క్లిప్పులు వాడారు. ఆ సినిమా నిర్మాత తాను అని.. అనుమతి లేకుండా తన సినిమా విజువల్స్ వాడారంటూ 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేసారు ధనుష్. దాంతో రెండేళ్ళుగా ఈ డాక్యుమెంటరీ విడుదలకు నోచుకోలేదు. మొన్న నవంబర్ 18న ఈ డాక్యుమెంటరి విడుదలైంది. ఇప్పుడు ధనుష్ మరోసారి కోర్టు వరకు వెళ్లడంతో విషయం మరింత ముదురుతుంది. మరి చూడాలిక.. ఏం జరగబోతుందో..?