ధనుష్.. నయనతార.. ఓ సినిమా..! వివాదానికి అసలు కారణం ఇదే.. పదేళ్లు వెనక్కి వెళ్తే..

కోలీవుడ్ స్టార్ ధనుష్.. లేడీ సూపర్ స్టార్ నయనతార మధ్య వార్ ఓ రేంజ్‌లో కొనసాగుతోంది. నయనతార కెరీర్, వివాహంపై రూపొందించిన ఓ డాక్యుమెంటరీ వేదికగా వివాదం చెలరేగుతోంది. డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మించిన ఓ సినిమాకు సంబంధించి..

ధనుష్.. నయనతార.. ఓ సినిమా..! వివాదానికి అసలు కారణం ఇదే.. పదేళ్లు వెనక్కి వెళ్తే..
Nayanthara Vs Dhanush
Follow us
Ch Murali

| Edited By: Ravi Kiran

Updated on: Nov 17, 2024 | 8:51 AM

కోలీవుడ్ స్టార్ ధనుష్.. లేడీ సూపర్ స్టార్ నయనతార మధ్య వార్ ఓ రేంజ్‌లో కొనసాగుతోంది. నయనతార కెరీర్, వివాహంపై రూపొందించిన ఓ డాక్యుమెంటరీ వేదికగా వివాదం చెలరేగుతోంది. డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మించిన ఓ సినిమాకు సంబంధించి కాపీరైట్ అంశం కారణమైనా.. ఇద్దరి మధ్య వివాదానికి గల అసలు కారణం వేరే ఉంది. ఇద్దరి మధ్య తాజాగా జరుగుతున్న కాంట్రవర్సీ వెనుక అసలు కారణం ఏంటనేది తెలియాలంటే పదేళ్లు వెనక్కి వెళ్లాలి.

తమిళ సినీ పరిశ్రమలో నటుడుగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో ధనుష్ ఒకరు. కోలీవుడ్ దర్శకుడు కస్తూరి రాజా కుమారులు దర్శకుడు సెల్వ రాఘవన్, నటుడు ధనుష్. ధనుష్ నటుడిగా బిజీగా ఉంటూనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్‌పై అనేక చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ధనుష్ ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో ఒకటైన ‘నాను రౌడీ దాన్’ అనే చిత్రానికి ధనుష్ నిర్మాత. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది దర్శకుడు విగ్నేష్. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నయనతార హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ద్వారానే విగ్నేష్, నయనతార మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారి వివాహం దాకా వెళ్ళింది. తాజాగా నయనతార, కెరీర్ వివాహం వీటన్నింటిపై ఒక డాక్యుమెంటరీ రూపొందించింది. నెట్‌ఫ్లిక్స్‌లో మరో రెండు రోజుల్లో స్క్రీనింగ్ కానుంది. ఈ డాక్యుమెంటరీలో నయనతార వివాహానికి సంబంధించి.. విగ్నేష్ పరిచయం.. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి దాకా వెళ్లడంలో ‘నాను రౌడీ దాన్’ నిర్మాణ సమయం కీలకం.. డాక్యుమెంటరీలో ఈ సినిమాకు సంబంధించిన అంశాలను చూపించడం కీలకంగా భావించిన నయనతార.. ఆ చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను పాటలను వాడుకునేందుకు నిర్మాతగా వ్యవహరించిన ధనుష్‌కు విజ్ఞప్తి చేశారు.

నిర్మాత నుంచి అనుమతి రాకపోవడంతో ఆ సినిమా చిత్రీకరణ సమయంలో మొబైల్ ద్వారా తీసిన కొన్ని సెకన్ల పాటు ఉన్న వీడియోని డాక్యుమెంటరీలో వాడారు. దీనిపై నిర్మాత ధనుష్ కాపీ రైట్ కింద పది కోట్లు ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ధనుష్ కోర్టుని ఆశ్రయించడంపై నయనతార సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. మూడు పేజీల లేఖను విడుదల చేసి ధనుష్‌పై నయనతార ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ‘డియర్ ధనుష్ దర్శకులైన తండ్రి, అన్న సహకారంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గొప్ప నటులైన మీరు నా లేఖను చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా.. నాలా ఒంటరి పోరాటం చేసేవారు ఎందరో ఉన్నారు.. ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో నా కెరీర్‌కు సంబంధించి రూపొందిన డాక్యుమెంటరీ కోసం నేను మాత్రమే కాదు ఎంతోమంది అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మీరు మాపై పెంచుకున్న ప్రతీకారం ఇందులో భాగస్వామ్యమైన సభ్యులను కూడా ఎంతగానో ఇబ్బంది పెడుతుందని నయనతార అన్నారు. డాక్యుమెంటరీలో సినిమాకు సంబంధించిన అంశాలను వాడుకునేందుకు నేను రెండేళ్ల నుంచి అనుమతి కోరుతున్నా.. మీరు ఇవ్వలేదు. మూడు సెకన్ల క్లిప్ వాడుకున్నందుకు పది కోట్లు ఇవ్వాలని కాపీ రైట్ పేరుతో మీరు డిమాండ్ చేయడం బాధాకరం. ఇక్కడే మీ వ్యక్తిత్వం ఏంటనేది అర్థమవుతుంది. నోటీసులను మేం న్యాయబద్ధంగానే సమాధానం ఇస్తామని’ నయనతార తెలిపారు.

అయితే ఇక్కడ వివాదానికి కారణంగా కనబడేది ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన సినిమాకు సంబంధించిన కాపీరైట్ అంశం అయినా.. ఇద్దరి మధ్య ఈ స్థాయిలో వివాదానికి అసలు కారణం వేరే ఉందని సినీ పరిశ్రమకు సంబంధించిన కొందరు చెబుతున్నారు. పదేళ్ల క్రితం విడుదలైన ‘నాను రౌడీ దాన్’ చిత్రానికి ధనుష్ నిర్మాత కాగా.. నయనతార భర్త విగ్నేష్ దర్శకుడు. అయితే ఆ సినిమా నిర్మాణం కోసం ముందుగా అనుకున్నది 6 కోట్ల బడ్జెట్ అయితే సినిమా పూర్తి కావడానికి 12 కోట్లకు పైగా ఖర్చు అయిందని తెలుస్తోంది. ఆ సినిమా నిర్మాణం జరుగుతున్న సమయంలోనే నయనతార, విగ్నేష్‌కు పరిచయం ఏర్పడడం.. వారిద్దరి మధ్య ప్రేమగా బంధం బలపడడం జరిగింది. ఇదే విషయం తాజాగా రూపొందించిన డాక్యుమెంటరీలో కూడా ఉంది. అయితే ఆ బడ్జెట్ అంతలా పెరగడానికి నయనతార కారణమని ధనుష్ అప్పట్లోనే మండిపడ్డట్టు ఇండస్ట్రీలో కూడా వార్తలు వచ్చాయి. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తనను ధనుష్ అవమానించారని.. అప్పటినుంచి ఇప్పటికి తమపై పగను పెంచుకున్నారని ఈ కారణంగానే కాపీరైట్ పేరుతో రిపోర్టు డిమాండ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. సినిమా నిర్మాణానికి సంబంధించి బడ్జెట్ పెరిగిన అంశం నయనతార ఎక్కడా ప్రస్తావించనప్పటికీ ఇద్దరి మధ్య ఈ స్థాయిలో వివాదానికి అసలు కారణం మాత్రం అదేనని ఇండస్ట్రీలో వినబడుతున్న మాట. వివాదానికి సంబంధించి ఈ ఇద్దరు ఇప్పటివరకు ఎక్కడా చెప్పని అసలు కారణం ఇదేనన్నది అందరూ చెబుతున్న మాట.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు