AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. నయనతార సంచలన కామెంట్స్..

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అమ్మడు వయసు పెరిగే కొద్ది ఈ అమ్మడు క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. వరుస సినిమాలతో ఇప్పటికీ కుర్ర భామలకు గట్టిపోటీనిస్తుంది. అందం, అభినయంతో సినీరంగంలో దూసుకుపోతుంది. నాలుగు పదుల వయసులోనూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటుంది నయన్.

Tollywood : ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. నయనతార సంచలన కామెంట్స్..
Nayan
Rajitha Chanti
|

Updated on: Nov 24, 2025 | 10:28 PM

Share

సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో నయనతార ఒకరు. గత రెండు దశాబ్దాలుగా సినీరంగంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. గతేడాది జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. హిందీలో తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన మన శంకరవరప్రసాద్ గారూ అనే చిత్రంలో నటిస్తుంది నయన్. ఈ క్రమంలోనే గతంలో నయన్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయిన గజిని సినిమా గురించి ఆమె చేసిన వ్యా్ఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ సినిమాలో నటించి తప్పు చేశానని అంటుంది నయన్. అందులో తనను సరిగ్గా చూపించలేదని ఆరోపించింది.

ఇవి కూడా చదవండి : Actress : కోట్లలో అప్పులు.. తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి ఈ బిగ్ బాస్ బ్యూటీ..

గజిని సినిమాలో నటించడం గురించి నయనతార మాట్లాడుతూ.. “నా కెరీర్‌లో నేను చేసిన అతి పెద్ద తప్పు గజిని సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించడానికి అంగీకరించడం. ఆ సినిమాలో నా పాత్రకు గురించి చెప్పినప్పుడు ఎంతో ఎగ్జైట్ అయ్యాను. కానీ నా పాత్రను సరిగ్గా సిద్ధం చేయలేదు. ఎడిటింగ్ లో చాలా సన్నివేశాలు కట్ చేశారు. సినిమాటోగ్రఫీ సరిగ్గా చేయలేదు. నన్ను కేవలం గ్లామర్ డాల్‌గా చూపించారు” అంటూ చెప్పుకొచ్చింది నయన్. ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ మరోసారి తెరపైకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి : Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?

“కానీ నేను దీనికి ఎవరినీ నిందించను. నా కెరీర్ ప్రారంభంలో ఆ పాత్ర నాకు ఒక పాఠం లాంటిది. కథ నచ్చే వరకు ఏ పాత్ర చేయకూడదని నేర్చుకున్నాను” అని తెలిపింది. నయన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటుంది. తెలుగుతోపాటు అటు తమిళంలోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..

Nayan, Suriya

Nayan, Suriya

ఇవి కూడా చదవండి : Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..