Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naveen Chandra: ‘తగ్గేదే లే’ అంటున్న నవీన్ చంద్ర.. ఆసక్తికరంగా టీజర్ విడుదల

టాలీవుడ్‌లో భద్ర ప్రొడక్షన్స్ అతి పెద్ద నిర్మాణ సంస్థగా అవతరించబోతోంది. విభిన్న చిత్రాలను భారీ బడ్జెట్‌లో నిర్మించేందుకు రెడీ అవుతోంది.

Naveen Chandra:  ‘తగ్గేదే లే’ అంటున్న నవీన్ చంద్ర.. ఆసక్తికరంగా టీజర్ విడుదల
Thaggede Le
Follow us
Rajeev Rayala

| Edited By: Phani CH

Updated on: Oct 15, 2021 | 9:06 AM

Naveen Chandra: టాలీవుడ్‌లో భద్ర ప్రొడక్షన్స్ అతి పెద్ద నిర్మాణ సంస్థగా అవతరించబోతోంది. విభిన్న చిత్రాలను భారీ బడ్జెట్‌లో నిర్మించేందుకు రెడీ అవుతోంది. అందులో భాగంగా వారి మొదటి చిత్రాన్ని నవీన్ చంద్ర హీరోగా శ్రీనివాస రాజు దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ గా ‘తగ్గేదే లే’  చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన  ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌ను గమనిస్తే.. సినిమా రస్టిక్ మాస్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. నవీన్ చంద్ర ఓ అమ్మాయిని పెళ్లి  చేసుకుంటాడు. ప్లే బాయ్ పాత్రలో ఎంతో మంది అమ్మాయిలతో సంబంధం పెట్టుకునే కుర్రాడి కారెక్టర్‌లో కనిపించనున్నాడు.

ఇక మరో వైపు సిటీలో మర్డర్ గ్యాంగ్ ఉంటుంది. వారి కోసం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఈ టీజర్‌లో సినిమాలో ముఖ్య పాత్రలన్ని కనిపిస్తాయి. ప్రతీ కేస్‌కు అంతం ఉంటుంది..నేరస్థులు చివరకు పట్టుబడతారు అనేదే తగ్గేదే లే కథ. రవిశంకర్ చివర్లో ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయేలా ఉంది. దివ్యా పిళ్లై, అనన్య సేనుగుప్తా హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో నాగబాబు, డానీ కుట్టప్ప, రవి కాలే, మకరంద్ దేశ్‌పాండే, అయ్యప్ప శర్మ, నవీన్ చంద్ర, పూజా గాంధీ, రాజా రవీంద్ర, రవి శంకర్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫర్‌గా, చరణ్ అర్జున్ సంగీత దర్శకుడిగా, గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు. థియేటర్లో మాస్ అండ్ హై ఇంటెన్స్ యాక్షన్ డ్రామాను ఇస్తుందని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ఈ చిత్రం త్వరలోనే విడుదలకానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jabardasth Sai Teja: సాయి తేజ నుంచి ప్రియాంక సింగ్‌గా మారడానికి పెద్ద యుద్ధమే చేశా.. తండ్రి అంధుడు.. చూసేవారు లేరంటూ..

Manchu Manoj-Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో మంచు మనోజ్ కీలక భేటీ.. గంటకు పైగా చర్చ

Mahesh Babu: రాజమౌళితో సినిమాపై మహేశ్ ఫుల్ క్లారిటీ.. ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్