Natural Star Nani : నాని నయా ప్లాన్.. అలా చేస్తే కానీ హిట్స్ రావని ఫిక్సైన నేచురల్ స్టార్..

అందుకే సీనియర్ దర్శకులకు దూరంగా ఉంటూ.. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్నారా..? ఆల్రెడీ ఓ కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్న నాని..

Natural Star Nani : నాని నయా ప్లాన్.. అలా చేస్తే కానీ హిట్స్ రావని ఫిక్సైన నేచురల్ స్టార్..
Nani
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 11, 2022 | 5:10 PM

హిట్ కొట్టాలంటే కొత్తగా ట్రై చేయాల్సిందే అని నాని ఫిక్స్ అయిపోయారా..? న్యూ టాలెంట్‌ను నమ్ముకుంటే తప్ప మళ్లీ తను ఫామ్‌లోకి రాలేనని అర్థం చేసుకున్నారా..? అందుకే సీనియర్ దర్శకులకు దూరంగా ఉంటూ.. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్నారా..? ఆల్రెడీ ఓ కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్న నాని.. నెక్ట్స్ కూడా న్యూ డైరెక్టర్‌కు అవకాశం ఇవ్వబోతున్నారు. మరి అతనెవరు..? కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే వాళ్లను నమ్మి సినిమాలు ఇవ్వాల్సి ఉంటుంది. అందరు హీరోలు అది చేయలేరు.. కొందరు మాత్రం కొత్త వాళ్లకు వరసగా ఆఫర్స్ ఇస్తుంటారు. ఈ జనరేషన్‌లో నాని అలా పైకొచ్చిన హీరోనే. తన కెరీర్‌లో చాలా వరకు నూతన దర్శకులకే ఛాన్సిచ్చారు నాని. ఇప్పుడు కూడా ఈయన నటిస్తున్న దసరా కొత్త దర్శకుడితోనే.. అతడి పేరు శ్రీకాంత్ ఓదెల.

కొన్నేళ్లుగా నాని వరసగా ఒకట్రెండు సినిమాల అనుభవం ఉన్న దర్శకులతోనే పని చేస్తూ వస్తున్నారు. కృష్ణవంశీ, రాజమౌళి లాంటి దర్శకులు మినహా.. సీనియర్లతో ఈయన వర్క్ చేసిన సందర్భాలు కూడా తక్కువే. పైగా ఎందుకో తెలియదు మరి అగ్ర దర్శకులు కూడా నాని వైపు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అందుకే వరసగా గౌతమ్ తిన్ననూరి, శివ నిర్వాణ, రాహుల్ సంక్రీత్యన్, వివేక్ ఆత్రేయ లాంటి యంగ్ జనరేషన్‌తో సినిమాలు చేస్తున్నారు న్యాచురల్ స్టార్.

దసరా సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో వస్తున్న దసరాకు 60 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తుంది. దీని తర్వాత శౌర్య అనే న్యూ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో.. అతడితో పని చేయడానికి నాని ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ దర్శకులతోనే ఫామ్‌లోకి రావాలని చూస్తున్నారు నాని. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.