Nara Lokesh: వెండి తెరపై హీరోగా అడుగు పెట్టాలనుకున్న నారా లోకేష్.. జస్ట్ ఛాన్స్ మిస్.. దర్శకుడు ఎవరో తెలుసా..

Nara Lokesh: ఎంజీఆర్ , ఎన్టీఆర్, కృష్ణ, జయలలిత, జయప్రద వంటి అనేకమంది నటీనటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇక్కడ కూడా తమదైన ముద్రవేశారు. ఇంకా..

Nara Lokesh: వెండి తెరపై హీరోగా అడుగు పెట్టాలనుకున్న నారా లోకేష్.. జస్ట్ ఛాన్స్ మిస్.. దర్శకుడు ఎవరో తెలుసా..
Nara Lokesh
Follow us

|

Updated on: Aug 18, 2021 | 10:11 AM

Nara Lokesh: ఎంజీఆర్ , ఎన్టీఆర్, కృష్ణ, జయలలిత, జయప్రద వంటి అనేకమంది నటీనటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇక్కడ కూడా తమదైన ముద్రవేశారు. ఇంకా చెప్పాలంటే .. రాజకీయాలకు, సినిమాలకు మధ్య ఉన్న అంతరాన్ని చెరిపివేశారు. అయితే సినిమాల్లో వారసులుగా నటీనటుల పిల్లలు .. రాజకీయాల్లోకి రాజకీయ నేతల పిల్లలు అడుగు పెట్టడం సర్వసాధారణం. కానీ కొంతమంది రాజకీయనాయకుల పిల్లలు వెండి తెరపై అడుగు పెట్టి.. అలరిస్తున్నారు. వారిలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ్ హీరోగా నటిస్తున్నాడు. ఇక తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ ఇద్దరు యంగ్ హీరోలు తమ డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి సుపరిచితులే.. అయితే మాజీ సీఎం చంద్రబాబు ఏకైక తనయుడు లోకేష్ కూడా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి రంగం రెడీ అయిందట. అవును ఒకప్పుడు నారావారబ్బాయి లోకేష్ సినిమాల్లోకి రావాలని ఒకప్పుడు గట్టి ప్రయత్నాలు చేశారనే  కొంతమందికి మాత్రమే తెలుసు.. ! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అయితే లోకేష్ ఏ సినిమాలో హీరోగా ఎంట్రీ ఇవ్వలనుకున్నారు.. ఎవరి డైరెక్షన్ తెలుసుకుందాం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో తన కొడుకు నారా లోకేష్ ను సినిమా హీరోగా పరిచయం చేయాలని సన్నాహాలు చేశారట. అప్పట్లో నితిన్ హీరోగా  నటించిన “జయం” సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీంతో లోకేష్ ను హీరోగా తేజ దర్శకత్వంలో ఒక ప్రేమ కథ చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం చేయాలని భావించారట. అయితే చంద్రబాబు ఆలోచన పట్టాలెక్కలేదు.  లోకేష్ సినిమా విషయం అప్పట్లో సినీ వార్తా పత్రిక సంతోషము కవర్ పేజీపై పెద్ద హెడ్డింగ్ తో లోకేష్ హీరోగా సినిమా మిస్ అనే వార్తను ప్రచురించారు. అదే సమయంలో జూఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు నారా వారసుడు హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఉంటె ఎలా ఉండేదో కానీ.. లోకేష్ సినిమా హీరో ఛాన్స్ మిస్ అయ్యి.. రాజకీయ నేతగా కొనసాగుతున్నారు.

Also Read: Best Chief Minister: దేశంలో బెస్ట్ సీఎంగా యోగి.. దారుణంగా పడిపోయిన తెలుగు సీఎంల స్థానాలు