AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dasari Arunkumar: దాసరి తనయుడు అరుణ్ కుమార్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు.. వివరాల్లోకి వెళ్తే..

Dasari Arunkumar: దివంగత దాసరి నారాయణరావు పేరు మళ్ళీ వార్తల్లో వినిపిస్తుంది. తాజాగా ఆయన కుమారుడు దాసరి అరుణ్ కుమార్ పై కేసు నమోదయ్యింది. బంజారాహిల్స్ పీఎస్ లో ఎస్సీ, ఎస్టీ..

Dasari Arunkumar: దాసరి తనయుడు అరుణ్ కుమార్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు.. వివరాల్లోకి వెళ్తే..
Dasari Arjunkumar
Follow us
Surya Kala

|

Updated on: Aug 18, 2021 | 10:42 AM

Dasari Arunkumar: దివంగత దాసరి నారాయణరావు పేరు మళ్ళీ వార్తల్లో వినిపిస్తుంది. తాజాగా ఆయన కుమారుడు దాసరి అరుణ్ కుమార్ పై కేసు నమోదయ్యింది. బంజారాహిల్స్ పీఎస్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. దాసరి నారాయణరావు తీసుకున్న అప్పు విషయం లో తగువు పడినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

బొల్లారం లోని మారుతినగర్ కు చెందిన నర్సింహులు (41) అనే వ్యక్తి పాత సినిమాల రిస్టోరేషన్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. దాసరి బతికి ఉన్న సమయంలో ఆయన వద్ద 2012నుంచి 2016వరకూ సినిమాల రిస్టోరేషన్‌ పనులను ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో చేశాడు. ఈ నేపథ్యంలో దాసరి నారాయణరావు మరణించిన అనంతరం కొన్ని పనులు బాకీ ఉన్నా వాటిని కూడా పలుమార్లు జూబ్లీహిల్స్‌లోని దాసరి ఇంటికి వెళ్లి పనులుపూర్తి చేశాడు.

అయితే పనులు పూర్తి అయిన తర్వాత డబ్బులు ఇవ్వాల్సిన విషయంలో నర్సింహులకు, దాసరి నారాయణరావు కొడుకులు ప్రభు, అరుణ్ కుమార్ ల మధ్య గొడవలు మొదలయ్యి. అపప్టి నుంచి నర్సింహులు తనకు రావాల్సిన డబ్బుల కోసం అరుణ్ ని అడుగుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 13 తేదీన నర్సింహులు ఫిలింనగర్‌లోని ఎఫ్‌ఎన్‌సీసీ వద్దకు రమ్మని చెప్పాడు. దీంతో నర్సింహులు తన స్నేహితులు శ్రీనివాస్‌, చంటితో కలిసి అక్కడకు వెళ్లాడు. అక్కడ దాసరి అరుణ్ కుమార్ తనను కులం పేరుతో దూషించాడని నర్సింహులు ఆరోపిస్తున్నాడు. ఈ నెల 16న అరుణ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

Also Read: . Best Chief Minister: దేశంలో బెస్ట్ సీఎంగా యోగి.. తెలుగు సీఎంలు ఏ స్థానాల్లో ఉన్నారంటే.!

Nara Lokesh: వెండి తెరపై హీరోగా అడుగు పెట్టాలనుకున్న నారా లోకేష్.. జస్ట్ ఛాన్స్ మిస్.. దర్శకుడు ఎవరో తెలుసా..