Tuck Jagadish: నాని టక్ వెనకాల కారణం అదేనా.. ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనున్న నేచురల్ స్టార్..
టక్ జగదీష్ మూవీ ఎలా ఉంటుందో ఏమో గానీ ఆ సినిమా రిలీజ్ వ్యవహారమే సినిమా రేంజ్‌లో ట్వీస్ట్‌లు టర్న్‌లతో సాగుతుంది. అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ రాకముందే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు ఫిక్స్ అయినట్టుగా

Tuck Jagadish: టక్ జగదీష్ మూవీ ఎలా ఉంటుందో ఏమో గానీ ఆ సినిమా రిలీజ్ వ్యవహారమే సినిమా రేంజ్‌లో ట్వీస్ట్‌లు టర్న్‌లతో సాగుతుంది. అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ రాకముందే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు ఫిక్స్ అయినట్టుగా న్యూస్ లీకైపోయింది. దీంతో ఇండస్ట్రీ జనాల్లో కలవరం మొదలైంది. ఆ మధ్య నాని కూడా కాస్త ఎమోషనల్‌గా నాకు మరోసారి ఓటీటీ రిలీజ్ తప్పటం లేదు అంటూ ఓ ఎమోషనల్ మెసేజ్ రిలీజ్ చేయటంతో డిజిటల్ రిలీజ్ మీద క్లారిటీ వచ్చింది. వెంటనే థియేటర్ అసోషియేషన్లు నాని మీద విమర్శలు చేయటం ఆ వెంటనే మరో వర్గం నానికి సారి చెప్పటం లాంటివి జరిగాయి. ఈ ఇన్సిడెంట్స్ తరువాత ఫైనల్‌గా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. టక్ జగదీష్ డిజిటల్ రిలీజ్ నిర్ణయం పూర్తిగా నిర్మాతలుగా తమదే అన్నారు. ఈ నిర్ణయానికి ముందు నాని నో చెప్పినా… పరిస్థితి అర్ధం చేసుకొని ఓకే చెప్పినందుకు ఓపెన్‌గా థ్యాంక్స్ చెప్పారు. అంతేకాదు డిజిటల్ రిలీజ్‌కు వెళ్లాలన్న ఉద్దేశం లేకపోయినా… ఈ కంప్యూటర్ యుగంలో కంటెంట్ మిస్ అవ్వకుండా ఎక్కువ రోజులు దాచి పెట్టడం కూడా చాలా కష్టం అంటున్న మేకర్స్… అందుకే ఓటీటీ రిలీజ్‌కు ఫిక్స్ అయ్యామని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇంకా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే నాని ఈ సినిమాలో మండల రెవెన్యూ అధికారి (MRO) గా కనిపిస్తున్నాడట. ఈ మూవీలో గట్స్ ఉన్న ఎంఆర్వోగా కనిపిస్తాడని తెలుస్తుంది. దర్శకుడు శివ నిర్వాణ టక్ జగదీష్ పాత్రను బలమైన భావోద్వేగాలు కుటుంబ బంధాలతో రూపొందించాడట.
మరిన్ని ఇక్కడ చదవండి :




