Sridevi Soda Center: సెన్సార్ పూర్తి చేసుకున్న శ్రీదేవి సోడా సెంటర్.. విడుదల ఎప్పుడంటే..

టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న లెటేస్ట్ చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా..

Sridevi Soda Center: సెన్సార్ పూర్తి చేసుకున్న శ్రీదేవి సోడా సెంటర్.. విడుదల ఎప్పుడంటే..
Sridevi Soda Cemter
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Aug 24, 2021 | 7:53 PM

టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న లెటేస్ట్ చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ఆనంది హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్‏కు విశేష స్పందన లభించింది. రూరల్ యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా రూపొందుతున్న ఈ మూవీని 70mm ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజైన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యూ/ఏ (U/A) సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా తెలిపారు. ఈ సినిమా రన్ టైమ్ రెండున్నర గంటలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన సుధీర్ బాబు, ఆనంది పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో సుధీర్ బాబు లైటింగ్ సూరిబాబు పాత్రలో కనిపించబోతున్నాడు. అటు విడుదల తేదీ కూడా దగ్గర పడుతుండడంతో మేకర్స్ చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు. శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తు్న్నారు. అలాగే శ్యామ్ దత్ సైనుద్ధీన్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

ట్వీట్..

Also Read: House Arrest Pre Release Event: హౌస్ అరెస్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..

Meera Mithun: మీరా మిథున్‏కు మరోసారి షాక్.. దళితులపై విమర్శల విషయంలో కోర్టు తీర్పు ఏంటంటే..

Maha Ganesha: ఆహా మరో ముందడుగు.. పిల్లల కోసం ప్రత్యేకంగా మహా గణేశ.. వినోదంలో మరింత జోష్..