AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

House Arrest Pre Release Event: హౌస్ అరెస్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..

House Arrest Pre Release Event: కరోనా మహామ్మారి ప్రభావం చిత్ర పరిశ్రమపై తీవ్రంగా పడింది. షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు వాయిదా పడగా

House Arrest Pre Release Event: హౌస్ అరెస్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..
House Arrest
Rajitha Chanti
| Edited By: Anil kumar poka|

Updated on: Aug 24, 2021 | 7:26 PM

Share

House Arrest Pre Release Event: కరోనా మహామ్మారి ప్రభావం చిత్ర పరిశ్రమపై తీవ్రంగా పడింది. షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు వాయిదా పడగా..చిత్రీకరణలో ఉన్న సినిమాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీంతో సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. ఇక కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం ఇప్పడిప్పుడే థియేటర్లు తెరుకుచుకుంటున్నాయి. ఇక ఇటీవల థియేటర్లలలో విడుదలైన తిమ్మరుసు, ఎస్ఆర్. కళ్యాణ మండపం సినిమాలు సూపర్ హిట్ అందుకోవడంతో ఇతర చిత్రాలను వీలైనంత తొందరగా విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్.  ఇక చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.  నటుడు శ్రీనివాస్ రెడ్డి, కమెడియన్ సప్తగిరిలు హీరోలుగా నటిస్తున్న లెటేస్ట్ చిత్రం హౌస్ అరెస్ట్. ఈ సినిమాకు 90 ఎంఎల్ ఫేమ్ శేఖర్ రెడ్డి యెర్ర దర్శకత్వం వహిస్తుండగా.. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‏టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‏గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో అదుర్స్ రఘు, రవి ప్రకాష్, సునయన ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‏కు మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇదివరకే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ వలన వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఆగస్ట్ 27న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్.

ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా.. జె. యువ‌రాజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, చోటా కె. ప్రసాద్ ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే హౌస్ అరెస్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను ఈరోజు సాయంత్రం హైదరాబాద్‍లో ఘనంగా నిర్వహిస్తుంది. ఈ వేడుకను మీరు టీవీ9 తెలుగులో 7.30 నిమిషాలకు ప్రత్యేక్షంగా వీక్షించవచ్చు.

వీడియో..

Also Read: Drugs Case: అవును.. రాగిణి, సంజనాలు డ్రగ్స్‌ తీసుకున్నారు.. ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టులో సంచలన విషయాలు.

Viral: అదృష్టానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్.. ఒక్క ఆలూ చిప్‌తో లక్షాధికారి అయింది.. కథేంటంటే?

Telangana EAMCET: రేపే తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు.. అడ్మిషన్‌ ప్రక్రియలో ఇంటర్‌ వెయిటేజ్‌ ఎత్తివేస్తూ నిర్ణయం.

Sithara Cute Photos: సూపర్ స్టార్ మహేశ్ గారాల పట్టి సితార .. కొత్త ఫోటోలు అదిరిపోయాయిగా!