Viral: అదృష్టానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్.. ఒక్క ఆలూ చిప్‌తో లక్షాధికారి అయింది.. కథేంటంటే?

దురదృష్టం వందసార్లు తలుపు తడితే.. అదృష్టం ఒక్కసారైనా తలుపు తట్టకమానదు! అలా అదృష్టం తలుపు తట్టినప్పుడు వెంటనే అప్రమత్తమై..

Viral: అదృష్టానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్.. ఒక్క ఆలూ చిప్‌తో లక్షాధికారి అయింది.. కథేంటంటే?
Viral News
Follow us

|

Updated on: Aug 24, 2021 | 4:35 PM

దురదృష్టం వందసార్లు తలుపు తడితే.. అదృష్టం ఒక్కసారైనా తలుపు తట్టకమానదు! అలా అదృష్టం తలుపు తట్టినప్పుడు వెంటనే అప్రమత్తమై ఆ అదృష్టాన్ని ఇంట్లోకి ఆహ్వానించాలని పెద్దలు అంటారు.! ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. కొందరి జీవితాల్లో జరిగే అనుకోని సంఘటనలు చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్లు సరదాతో చేసే పనులే కొన్నిసార్లు కలిసొచ్చి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి.

ఇప్పుడు చెప్పబోయేది కూడా ఈ కోవకు చెందిన సంఘటనే. ఓ పదమూడేళ్ల అమ్మాయి టైంపాస్‌గా చిప్స్ తింటుంటే.. ఆమెకు అందులో ఓ చిప్ వెరైటీగా కనిపించింది. అస్సలు కొరకాలనిపించలేదు. దాచుకోవాలని నిర్ణయించుకుంది. వెంటనే ఓ వీడియో తీసి టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేయడంతో దాన్ని వేలం వేయమంటూ చాలామంది ఆ అమ్మాయికి సలహా ఇచ్చారు. ఆశ్చర్యకరంగా ఆ ఒక్క ఆలూ చిప్‌కి వేలంలో ఏకంగా రూ.14 లక్షలు పలికింది. ఇది మీకు కాస్త షాకింగ్‌గా అనిపించవచ్చు. కానీ నిజమండీ.. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.

ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌కి చెందిన 13 ఏళ్ల బాలిక రైలీ స్టువార్ట్‌కు పొటాటో చిప్స్ అంటే చాలా ఇష్టం. అందులోనూ ప్రముఖ బ్రాండ్ డోరిటోస్ ఆలూ చిప్స్ అంటే మరీ ఇష్టం. చిప్స్ తింటూ రుచిని ఆస్వాదిస్తున్న రైలీకి ఓ చిప్ సమోసాలాగా ఉబ్బినట్లు కనిపించింది. భలే ఉంది ముద్దుగా అనుకుని ఫ్రెండ్స్‌కి షేర్ చేసింది. దాచుకుందామనుకుంటే వాళ్లు దాన్ని వేలం వేయమని సలహా ఇచ్చారు.

అలా తీసిన వీడియో ట్విట్టర్, ఫేస్‌బుక్‌లోనూ వైరల్ అయింది. దీంతో మిలియన్ల వ్యూస్ వచ్చాయి. రైలీకి ఏం అర్థం కాలేదు. అవునా ఈ ఆలూ చిప్‌కి ఇంత డిమాండ్ ఉందా అనుకుంది. ఈబే సైట్‌లో లిస్ట్ చేసింది. చిప్ విలువ డాలర్ కంటే తక్కువే కోట్ చేసింది. కానీ ఆమె ఊహించని విధంగా దాని విలువ గంటల వ్యవధిలో 2వేల డాలర్లకు చేరుకుంది. ఎవరో ఎందుకు దాన్ని కొనడం అని డోరిటోస్ కంపెనీనే ముందుకు వచ్చి 13 ఏళ్ల రైలీకి రూ.14 లక్షలు ఇచ్చి కొనుగోలు చేసింది. అంత ధర ఎందుకు పెట్టడం అంటే ఆ ఇంటి వాళ్లు మా చిప్స్ బాగా తింటారు అని బదులిచ్చింది. సో.. అదృష్టం ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరికీ అర్థం కాదు.

Latest Articles