AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wife and Husband Funny Video: భర్తంటే ఇలా ఉండాలి!.. ట్విస్ట్ ఇస్తే ఇలా ఇవ్వాలి.. మ్యాటర్ తెలిస్తే పడి పడి నవ్వుతారు..

Wife and Husband Funny Video: భార్య, భర్తల అనుబంధాన్ని మించిన బంధం ఈ దునియాలో మరేదీ లేదు. కోపమైనా, ప్రేమనా, అలకైనా, అర్థం చేసుకోవడమైనా.. అన్నీ వివాహ బంధంలో..

Wife and Husband Funny Video: భర్తంటే ఇలా ఉండాలి!.. ట్విస్ట్ ఇస్తే ఇలా ఇవ్వాలి.. మ్యాటర్ తెలిస్తే పడి పడి నవ్వుతారు..
Funny Video
Shiva Prajapati
|

Updated on: Aug 24, 2021 | 7:48 PM

Share

Wife and Husband Funny Video: భార్య, భర్తల అనుబంధాన్ని మించిన బంధం ఈ దునియాలో మరేదీ లేదు. కోపమైనా, ప్రేమనా, అలకైనా, అర్థం చేసుకోవడమైనా.. అన్నీ వివాహ బంధంలో మిళితమై ఉంటాయి. అందుకే.. మ్యారీడ్ కపుల్స్ ఎప్పుడూ సరదాగా, ఫన్నీగా, ఉత్సాహంగా ఉంటారు. కొందరు దంపతులైతే.. తమ భాగస్వాములను ఆటపట్టిస్తూ, నవ్విస్తూ, కవ్విస్తూ చాలా సరదాగా ఉంటారు. ఇలాంటి వారే తమ సరదా సన్నివేశాలను వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అలా నెటిజన్లను కూడా అలరిస్తుంటారు. ఈ మధ్యకాలంలో భార్యా, భర్తలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ భార్యాభర్తల వీడియోలు ఎన్నిసార్లు చూసినా బోర్ అనిపించదు. ఎందుకంటే.. వారి అల్లరిలో ఫన్ ఉంటుంది, సరదా ఉంటుంది. ఇలాంటి వీడియో ఒకటి తాజాగా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. 35 సెకన్లపాటు ఉన్న ఈ వీడియో నెటిజన్లు కడుపుబ్బా నవ్విస్తోంది. ఓ భర్త తన భార్యకు అద్భుతమైన స్వాగతం పలుకుతూనే.. ఊహించని ట్విస్ట్‌తో హడలెత్తించాడు. ఆ ట్విస్ట్ చూసి అప్పటి వరకు సంతోషంగా ముందుకు అడుగులు వేసిన ఆమె.. ఆ తరువాత వెనకడుగు వేసింది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వీడియోలో ఓ భర్త.. తన భార్యను ఇంట్లో ఆహ్వానించాడు. తన కోసం ప్రత్యేకంగా పూల రహదారిని ఏర్పాటు చేశాడు. అది చూసి ఆ భార్య మురిసిపోయింది. తన భర్త స్వాగతానికి ఫిదా అయిపోయింది. అలా ఒక గదిలోంచి మరో గదిలోకి పూల పాన్పుపై నడుచుకుంటూ వచ్చింది. మరో గదిలో ఎంటర్ అయ్యేందుకు రిబ్బన్ కట్ చేయించాడు ఆ భర్త. అలా రెండవ గదిలో కూడా పూల దారి ఏర్పాటు చేశాడు. ఆ దారి నేరుగా కిచెన్‌లోకి ఏర్పాటు చేశాడు. అది తెలియని ఆ భార్య.. సంతోషంతో మురిసిపోతూ అడుగులు ముందుకు వేసింది. అలా నేరుగా కిచెన్ గదిలోకి వెళ్లింది. అక్కడ తన భర్త ఇచ్చిన సర్‌ప్రైజ్ చూసి షాక్‌కు గురయ్యింది. అప్పటి వరకు ముందడుగు వేసిన ఆమె.. ఆ తరువాత వెనుక్కి అడుగులు వేసింది. ఇంతకీ అతను ఇచ్చిన సర్‌ప్రైజ్ ఏంటో తెలుసా?.. సింక్ నిండా గిన్నెలు పెట్టి.. ఇవి కడగాలంటూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఆ గిన్నెలన్నీ క్లీన్ చేయాలంటూ షాక్ ఇచ్చాడు. ఆ షాకింగ్ ట్విస్ట్‌కు బిత్తరపోవడం ఆమె వంతైంది. భర్త ఇచ్చిన ట్విస్ట్‌కు అప్పటి వరకు సంతోషంతో వెలిగిపోయి భార్య మొహం.. కాసేపటికే ఆగ్రహంతో ఎర్రబారింది. వెంటనే గదిలోంచి బయటకు వెళ్లిపోయింది.

కాగా, ఈ వీడియోను ‘‘Tha Fackin Daddy’’ అనే ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేయగా.. అదికస్తా వైరల్‌గా మారింది. 35 సెకన్ల ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. వీడు మగాడ్రా బుజ్జి అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ‘భర్తంటే ఇలా ఉండాలి.. షాక్ ఇస్తే ఇలా ఇవ్వాలి’ అంటూ మరొకొందరు కామెంట్స్ పెడుతున్నారు. కాగా, ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చేస్తోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 30 వేల మందికి పైగా వీక్షించారు.

Viral Video:

Also read:

Navy Jobs 2021: నేవల్‌ షిప్‌ రిపేర్‌ యార్డులో ఉద్యోగాలు.. అర్హులెవరు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.

హౌస్ అరెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్..: House Arrest Pre-Release Event Live Video.

త్రివిక్రమ్ సందడి చేయనున్న ఇచ్చట వాహనాలు నిలుపరాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో..:Ichata Vahanamulu Niluparadu Pre-Release.