- Telugu News Photo Gallery Cinema photos These are the busiest stars in tollywood jr ntr prabhas ram charan mahesh babu allu arjun
టాలీవుడ్లో అత్యంత బిజీగా ఉండే హీరోస్ వీళ్లే.. అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్న స్టార్స్..
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలు వరుస చిత్రాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. గత కొద్దిరోజులుగా ప్రేక్షకుల ముందుకు రాకుండా.. ఒకేసారి వరుస ట్రీట్స్ ఇచ్చేందుకు రెడి అయ్యారు. అది కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలను తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ క్రమంలోనే విరామం లేని షెడ్యూల్స్ వేస్తూ.. సినిమాలను చిత్రీకరించే పనిలో పడ్డారు ఈ స్టార్ హీరోలు. మరి తెలుగులో ఎవరెవరు అత్యంత బిజీగా ఎన్ని సినిమాల్లో నటిస్తున్నారో తెలుసుకుందామా.
Updated on: Aug 24, 2021 | 7:22 PM

టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఇటీవల నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. వీరు వచ్చే ఏడాది మూడు థియేట్రికల్ చిత్రాలను విడుదల చేయనున్నారు. అంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రాధే శ్యామ్ మూవీ సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఆ తర్వాత ఏప్రిల్‌లో సలార్, ఆగస్ట్‌లో ఆదిపురుష్ సినిమాలను విడుదల చేయనున్నారు.

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లానాయక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే హరి హర వీరమల్లు సినిమా కూడా ఈ వేసవిలో సందడి చేయనుంది. అలాగే PSPK28 2022 చివరి నాటికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆలాగే ఆచార్య మూవీ త్వరలో విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్లో #RC15 సినిమాను పట్టాలెక్కించనున్నాడు.

అలాగే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈమూవీని పాన్ ఇండియా లెవల్లో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్.

అలాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

ఇక ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత మహేష్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.




