Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Seeti Maar: థియేటర్లలో సీటీ కొట్టే సమయం వచ్చేసింది.. గోపీచంద్‌ కొత్త చిత్రం విడుదల ఎప్పుడంటే.

Seeti Maar Release Date: 'సౌఖ్యం' సినిమా తర్వాత మళ్లీ ఆశించిన స్థాయిలో అందుకోలేకపోయారు హీరో గోపీచంద్‌. 'గౌతమ్‌ నంద' నుంచి 'చాణక్య' వరకు గోపీచంద్‌ వరుస...

Seeti Maar: థియేటర్లలో సీటీ కొట్టే సమయం వచ్చేసింది.. గోపీచంద్‌ కొత్త చిత్రం విడుదల ఎప్పుడంటే.
Seetimaar Releasing Date
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 24, 2021 | 9:35 PM

Seeti Maar Release Date: ‘సౌఖ్యం’ సినిమా తర్వాత మళ్లీ ఆశించిన స్థాయిలో అందుకోలేకపోయారు హీరో గోపీచంద్‌. ‘గౌతమ్‌ నంద’ నుంచి ‘చాణక్య’ వరకు గోపీచంద్‌ వరుస అపజయాలను ఎదుర్కొన్నారు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్న గోపీచంద్‌ ఇప్పుడు సీటీమార్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమన్నా నటిస్తోంది. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో తమన్నా ఉమెన్స్‌ కబడ్డీ జట్టుకి, గోపీచంద్‌ మెన్స్‌ జట్టుకి కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఈ సినిమా గత ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

అయితే తాజాగా థియేటర్లు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే సీటీమార్‌ చిత్రాన్ని సెప్టెంబర్‌ 3న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ చిత్రంపై భారీ అంచనాలను పెంచేసింది. దీంతో ఈసారి గోపీచంద్‌ కచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన ఫ్యాన్స్‌ ధీమాతో ఉన్నారు. మరి సెప్టెంబర్‌ 3న ప్రేక్షకుల ముందకు వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Also Read: Joker Malware: ‘జోకర్’ మళ్లీ వచ్చేసింది.. మీ ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉంటే వెంటనే డిలీట్‌ చేయండి. లేదంటే మీ పని అంతే.

Aadhaar Card: ఆధార్ కార్డులో పేరుతో పాటు ఇతర వివరాలు మార్చుకోవాలా..? ఈ డాక్యుమెంట్లలో ఏదైనా సమర్పించవచ్చు..!

టాలీవుడ్‏లో అత్యంత బిజీగా ఉండే హీరోస్ వీళ్లే.. అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్న స్టార్స్..