Trivikram Srinivas: ఆ సినిమా చూసిన తర్వాతే సుశాంత్‌ను నా సినిమాలోకి తీసుకున్నా.. త్రివిక్రమ్ ఆసక్తికర కామెంట్స్

అక్కినేని యంగ్ హీరో సుశాంత్ నటిస్తున్నతాజా చిత్రం ఇచ్చట వాహనాలు నిలుపరాదు. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది...

Trivikram Srinivas: ఆ సినిమా చూసిన తర్వాతే సుశాంత్‌ను నా సినిమాలోకి తీసుకున్నా.. త్రివిక్రమ్ ఆసక్తికర కామెంట్స్
Trivikram
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 24, 2021 | 10:26 PM

Trivikram Srinivas: అక్కినేని యంగ్ హీరో సుశాంత్ నటిస్తున్నతాజా చిత్రం ఇచ్చట వాహనాలు నిలుపరాదు. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హాజరయ్యారు. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుఠపురంలో సినిమాలో సుశాంత్ సెకండ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ కి రావడానికి సాహసిస్తున్న జాతి తెలుగు జాతి మాత్రమే..ఇది ఆనందించాల్సిన విషయం అన్నారు. అలాగే భయపడక్కర్లేదు పాటిద్దాం మంచి కంటెంట్ ను క్రియేట్ చెద్దాం మరింత ముందుకు వెళ్దాం అన్నారు. సుశాంత్ ఒక చట్రం లో ఇరుక్కుపోయాడు అనుకునేవాడిని..అయితే చిలసౌ సినిమాతో తన పంథాను మార్చుకున్నాడు. నేను చిలసౌ చూసే అల వైకుంఠపురంలో నటించమని అడిగాను అని అన్నారు.

ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమా బాగా వచ్చింది అని విన్నాను. యాక్టర్స్ కి ఏడవడం కష్టం అనుకుంటారు కానీ…నవ్వడం కష్టం అన్నారు. అలాగే ఈ సినిమాలో ఒన్ డే లో ఒక సాంగ్ తీశారు అది చాలా హ్యాపీ విషయం. ప్రవీణ్ మ్యూజిక్ నాకు బాగా నచ్చింది పాటలు బాగున్నాయి. కరోనా నుంచి మనందరం ఇంకా బయటకు వచ్చి ఇంకా బాగా పనిచేసే రోజులు రావాలని..జనం అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండే రోజులు రావాలని అది ఈ ఫంక్షన్ తో మొదలవ్వాలి అని కోరుకుంటున్నాను అని త్రివిక్రమ్ అన్నారు. ప్రముఖ నటి భానుమతి మనవడు రవిశంకర్ శాస్త్రి – ఏక్తా శాస్త్రి – హరీష్ కొయ్యలగుండ్ల ఈ చిత్రాన్ని AI స్టూడియోస్ & శాస్త్రా మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఎస్ దర్శన్ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Seeti Maar: థియేటర్లలో సీటీ కొట్టే సమయం వచ్చేసింది.. గోపీచంద్‌ కొత్త చిత్రం విడుదల ఎప్పుడంటే.

తనపై వస్తున్న ఫేక్ న్యూస్ లపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంచు వారి అబ్బాయి..:Manchu Manoj Video.

Sridevi Soda Center: సెన్సార్ పూర్తి చేసుకున్న శ్రీదేవి సోడా సెంటర్.. విడుదల ఎప్పుడంటే..