Joker Malware: ‘జోకర్’ మళ్లీ వచ్చేసింది.. మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి. లేదంటే మీ పని అంతే.
Joker Malware: 'జోకర్' మాల్వేర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్‌లలోకి చొరబడే ఈ వైరస్ ఫోన్‌లలో ఉన్న విలువైన సమాచారాన్ని మనకు..
Joker Malware: ‘జోకర్’ మాల్వేర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్‌లలోకి చొరబడే ఈ వైరస్ ఫోన్‌లలో ఉన్న విలువైన సమాచారాన్ని మనకు తెలియకుండానే కాజేస్తుంది. అంతటితో ఆగకుండా హ్యాకర్లు ఈ సమాచారాన్ని డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టేస్తున్నారు. ఖాతాల్లోని డబ్బులను సైతం కాజేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం ఈ మాల్వేర్ సృష్టించిన హంగామా అంతా ఇంత కాదు. ఈ క్రమంలోనే జోకర్ మాల్వేర్ పలు యాప్‌ల ద్వారా మొబైల్ ఫోన్‌లలోకి ప్రవేశిస్తుందంటూ అప్పట్లో గూగుల్ కొన్ని యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించింది.
అయితే తాజాగా మరోసారి జోకర్ కలకలం చెలరేగింది. జోకర్ వైరస్ తిరిగి వచ్చిందని బెల్జియన్ పోలీసులు ఆండ్రాయిడ్ యూజర్లను హెచ్చరించారు. ‘గూగుల్ నిషేదించిన ఎనిమిది ప్లే స్టోర్ అప్లికేషన్లలో ఈ హానికరమైన వైరస్ ను గుర్తించినట్లు’ బెల్జియన్ పోలీసులు తమ పోర్టల్‌లో తెలిపారు. ఈ మాల్వేర్ గురించి తెలియగానే గూగుల్ తమ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్స్‌ను తొలగించింది. గూగుల్ తొలగించిన ఆ 8 ఆండ్రాయిడ్ యాప్స్ ఇవే.. Auxiliary Message, Element Scanner, Fast Magic SMS, Free Cam Scanner, Go Messages, Super Message, Super SMS, Travel Wallpapers. మరి మీ ఫోన్‌లో ఈ యాప్‌లు ఉన్నాయా.? అయితే వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేసేయండి.
Sridevi Soda Center: సెన్సార్ పూర్తి చేసుకున్న శ్రీదేవి సోడా సెంటర్.. విడుదల ఎప్పుడంటే..