Royal Enfield: వచ్చేస్తుంది.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కొత్త క్లాసిక్‌ 350.. సెప్టెంబర్‌ 1న లాంచ్‌.. ధర ఎంతో తెలుసా..?

Royal Enfield: ద్విచక్ర వాహనాలలో సంచలనం రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఈ బైక్‌పై రైడ్‌ ఎంతో హుందాగా ఉంటుంది. తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్

Royal Enfield: వచ్చేస్తుంది.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కొత్త క్లాసిక్‌ 350.. సెప్టెంబర్‌ 1న లాంచ్‌.. ధర ఎంతో తెలుసా..?
Royal Enfield Classic 350 2021
Follow us
uppula Raju

|

Updated on: Aug 25, 2021 | 8:45 AM

Royal Enfield: ద్విచక్ర వాహనాలలో సంచలనం రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఈ బైక్‌పై రైడ్‌ ఎంతో హుందాగా ఉంటుంది. తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త క్లాసిక్ 350 కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ బైక్ విడుదల తేదీని కంపెనీ ప్రకటించింది. సెప్టెంబర్ 1 న కొత్త తరం క్లాసిక్ 350 బైక్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ‘బ్లాక్ యువర్ డేట్’ ఆహ్వానాన్ని షేర్ చేయడం ద్వారా కంపెనీ దీనిని ధృవీకరించింది. ఫీచర్ల గురించి మాట్లాడితే.. లీకైన పాత చిత్రాల ప్రకారం రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ లోపల, వెలుపల పూర్తి కొత్తగా ఉంటుంది. ఇది మెటోర్ 350 J- ప్లాట్‌ఫామ్‌లో అందిస్తున్నారు. కొత్త చట్రం, మీటర్ కన్సోల్, స్వింగార్మ్‌తో సహా ఇతర అప్‌డేట్‌లను చూడవచ్చు. దీనితో పాటు డిజైన్‌లో కొత్త మార్పులు కూడా గమనించవచ్చు.

క్లాసిక్ 350 లో 349 సీసీ సింగిల్ సిలిండర్ పవర్‌ట్రెయిన్ సాంకేతిక లక్షణాలు ఇంకా నిర్ధారించబడనప్పటికీ ఈ బైక్ 349 సిసి సింగిల్ సిలిండర్, మెటోర్ 350 DOHC ఇంజిన్‌ను పొందుతుంది. ఇది కాకుండా మునుపటిలాగే 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంటుంది. బైక్ టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో కొత్త మీటర్ కన్సోల్‌ను పొందుతుంది.

ధర రూ.1.85 లక్షల నుంచి ప్రారంభం.. కొత్త తరం క్లాసిక్ 350 ప్రస్తుత మోడల్ కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. లాంచ్ సమయంలో ఈ బైక్ ఎంట్రీ లెవల్ ధర రూ.1.85 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి 2.20 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఈ బైక్ హోండా H’Ness, CB350 జావా బైక్‌లతో పోటీపడుతుంది. రాబోయే కొన్ని నెలల్లో కంపెనీ చాలా కొత్త బైక్‌లను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది.

Nivetha Pethuraj: తన లైఫ్‌ స్టైల్‌ను పూర్తిగా మార్చేశానని చెబుతోన్న నివేదా.. ఇంతకీ ఈ భామలో వచ్చిన ఆ మార్పులేంటంటే.

సముద్రంలో భూప్రకంపనలు సునామీకి దారి తీస్తాయా..! ఆందోళన చెందుతున్న తీర ప్రాంత వాసులు..

Telangana: ఓవైపు కరోనా, మరోవైపు వైరల్ ఫీవర్స్‌.. కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ సర్కార్