AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nivetha Pethuraj: తన లైఫ్‌ స్టైల్‌ను పూర్తిగా మార్చేశానని చెబుతోన్న నివేదా.. ఇంతకీ ఈ భామలో వచ్చిన ఆ మార్పులేంటంటే.

Nivetha Pethuraj: తమిళ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్‌. అక్కడ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నది 'మెంటల్‌ మదిలో' సినిమాతో...

Nivetha Pethuraj: తన లైఫ్‌ స్టైల్‌ను పూర్తిగా మార్చేశానని చెబుతోన్న నివేదా.. ఇంతకీ ఈ భామలో వచ్చిన ఆ మార్పులేంటంటే.
Nivetha Peturaj
Narender Vaitla
|

Updated on: Aug 25, 2021 | 8:04 AM

Share

Nivetha Pethuraj: తమిళ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్‌. అక్కడ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నది ‘మెంటల్‌ మదిలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో తన క్యూట్ నటనతో తెలుగు కుర్రకారును ఆట్రాక్ట్‌ చేసింది. ఇక అనంతరం తమిళంతోపాటు తెలుగలోనూ వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోందీ చిన్నది. ఈ క్రమంలోనే అల వైకుంఠపురములో నటించి మరోసారి తళుక్కుమంది. ఇక తాజాగా విశ్వక్‌ సేన్‌ హీరోగా తెరకెక్కిన ‘పాగల్‌’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందకు వచ్చింది నివేదా. ఈ సినిమాతో పాటు తెలుగులో విరాటపర్వం, మరో చిత్రంలోనూ నటిస్తోంది.

ఇక పాగల్‌ సినిమా సందర్భంగా ఈ అమ్మడు బ్యాక్‌ టు బ్యాక్‌ ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుందీ అమ్మడు. ఇటీవల తన వ్యక్తిగత జీవితంలో పెద్ద మార్పు వచ్చిందని చెప్పుకొచ్చింది నివేదా. శాఖాహారిగా మారడంతో పాటు వ్యక్తిత్వం విషయంలోనూ తనలో చాలా మార్పు వచ్చిందని ఆమె తెలిపింది. అంతేకాకుండా చక్కెర వాడకాన్ని పూర్తిగా తగ్గించేశానని చెప్పుకొచ్చిన ఈ చిన్నది.. కొంతకాలంగా ఆర్గానిక్‌ తేనెను ఉపయోగిస్తున్నానని తెలిపింది. ఇక కొంత కాలంగా కేవలం చేతితో తయారు చేస్తున్న ఉత్పత్తులను మాత్రమే వాడుతున్నానని చెప్పుకొచ్చిన నివేదా.. షాపింగ్‌ సమయంలో ఆహారం, కలర్‌ లాంటి విషయాల్లో ఇదే విధానాన్ని అవలంభిస్తున్నట్లు పేర్కొంది.

ఇదిలా ఉంటే విరాట పర్వంలో నివేదా మునుపెన్నడూ కనిపించని పాత్రలో కనిపించనుందని చర్చ జరుగుతోంది. మరి టాలీవుడ్‌లో పాగా వేయాలని ప్రయత్నిస్తోన్న నివేదాకు ఈ సినిమా ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.

Also Read: దిల్ మాంగే మోర్.. రిస్క్ ఎలాంటిదైనా ఇవి ఉండాల్సిందే.. కేబుల్ నుంచి భారతీయుల తరలింపులో వీటిదే కీ రోల్..

Telangana EAMCET: మరికాసేపట్లో విడుదల కానున్న తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు.. ఇలా చెక్‌ చేసుకోండి.

Horoscope Today: ఈ రాశివారికి ప్రమోషన్లు లేదా ట్రాన్స్‌ఫర్‌లు.. వ్యాపారులకు లాభాలు..