Google Maps: ఇకపై గూగుల్ మ్యాప్స్ వాటిని కూడా చూపిస్తుంది..దీంతో మీ జేబు ఖాళీ అవని రూట్‌లో వెళ్లొచ్చు!
మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దారులు తెలుసుకోవడం కోసం.. ఒక్కోసారి దగ్గర రూట్లను చెక్ చేసుకోవడం కోసం గూగుల్ మ్యాప్స్ ఉపయోగిస్తాం.
Google Maps: మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దారులు తెలుసుకోవడం కోసం.. ఒక్కోసారి దగ్గర రూట్లను చెక్ చేసుకోవడం కోసం గూగుల్ మ్యాప్స్ ఉపయోగిస్తాం. ఎవరిదైనా తెలియని ఎడ్రస్ కోసం గూగుల్ మ్యాప్స్ లో వెతుక్కుని వెళ్ళిపోతాం. ఇదివరకులా ఎడ్రస్ కోసం ఎక్కువగా శ్రమ పడే అవసరం లేకుండా గూగుల్ చేసింది. లాంగ్ టూర్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా గూగుల్ మ్యాప్స్ సహాయంతో ఎన్ని కిలోమీటర్లు మన గమ్యస్థానం ఉంది.. ఎంతసేపటిలో వెళ్లగలుగుతాం అనే అంచనాలు వేసుకోవడానికి ఉపయోగిస్తుంటాం. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ సరికొత్త అప్‌డేట్ తో వస్తోందని చెబుతున్నారు.
గూగుల్ మ్యాప్స్ ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌పై పనిచేస్తోంది. ఇది యూజర్లు తమ పర్యటనలను మెరుగ్గా ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. మ్యాపింగ్ యాప్ ఇప్పుడు ఏ రోడ్లకు ఎన్ని టోల్ గేట్‌లు ఉన్నాయో.. అదేవిధంగా టోల్ ట్యాక్స్‌గా మీరు ఎంత చెల్లించాల్సి ఉంటుందో తెలియజేస్తుంది. మీరు టోల్ గేట్ రోడ్డు తీసుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది. ఈ ఫీచర్ ప్రారంభ దశలో ఉందని చెబుతున్నారు. ఈ ఫీచర్ అన్ని దేశాలలో అందుబాటులో ఉంటుందా అనేది ఇంకా స్పష్టం కాలేదు. అయితే, అన్ని దేశాలకూ భవిష్యత్ లో విస్తరించే అవకాశం ఉంది.
రాబోయే గూగుల్ మ్యాప్స్ ఫీచర్ వినియోగదారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తరచుగా మీరు ప్రయాణానికి బయలుదేరినప్పుడు, దారిలో చాలా టోల్ గేట్‌లను చూసి మీకు ఆమ్మో అనిపిస్తుంది. ముఖ్యంగా కొత్త రూట్లలో వెళుతున్నప్పుడు టోల్ గెట్ ఎక్కడ వస్తుందో.. అక్కడ ఎంత చెల్లించాల్సి వస్తుందో తెలియక అయోమయంగా ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ మొత్తం టోల్‌లకు ఎంత ఖర్చవుతుంది.. మీఋ వెళుతున్న మార్గంలో ఎన్ని టోల్ గేట్‌లు వస్తాయి అనే సమాచారాన్ని మీకు అందించగలిగితే, మీరు టోల్ గేట్‌లతో నిండిన రహదారిలో వెళ్లాలా? లేకపోతే వేరేదారిలో వెళ్ళొచ్చా అనే విషయాన్ని సులభంగా నిర్ధారించుకోగలుగుతారు. ఇది వినియోగదారులకు సమయాన్ని ఆదా చేయడానికి కూడా సహాయపడుతుంది.
రాబోయే ఫీచర్ గురించి గూగుల్ అధికారికంగా ఏమీ ప్రకటించనప్పటికీ, రాబోయే ఫీచర్ గురించి గూగుల్ మ్యాప్స్ ప్రివ్యూ ప్రోగ్రామ్ సభ్యులకు రోడ్లు, వంతెనలు, ఇతర “ఖరీదైన చేర్పులు” అనే సందేశం పంపించినట్లు ఆండ్రాయిడ్ పోలీస్ నివేదిక పేర్కొంది. మీ నావిగేషన్ మార్గం కోసం టోల్‌ల ధరలను ప్రదర్శించండి. మొత్తం మ్యాప్ టోల్ టాక్స్ మీ యాప్‌కు క్రెడిట్ అవుతుందని గూగుల్ మ్యాప్స్ ప్రివ్యూ ప్రోగ్రామ్ నిర్ధారించింది. వినియోగదారులు మార్గాన్ని ఎంచుకోవడానికి ముందే ఇది వారికి కనిపిస్తుంది.
ఇది వేజ్ (Waze) యాప్ నుండి గూగుల్ మ్యాప్స్ తీసుకుంటున్న ఫీచర్ అని తెలుస్తోంది. 2013 సంవత్సరంలో కంపెనీ దీనికి అధికారం ఇచ్చింది. వేజ్ యాప్ మీకు టోల్ ప్లాజాల గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఈ యాప్ మూడు సంవత్సరాల క్రితం టోల్ టాక్స్ గురించి పూర్తి సమాచారం ఇవ్వడం ప్రారంభించింది. వేజ్ మ్యాపింగ్ ఫీచర్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, చిలీ, కొలంబియా, డొమినికన్ రిపబ్లిక్, ఇజ్రాయెల్, లాట్వియా, న్యూజిలాండ్, పెరూ, పోలాండ్, స్పెయిన్, USA ఆఅలాగే కొన్ని ఇతర దేశాలు ఉన్నాయి.
అయితే, గూగుల్ ఈ ఫీచర్‌ని ఎప్పుడు తీసుకొస్తుందో ఇంకా చెప్పలేదు. అదే సమయంలో, ఈ ఫీచర్ కేవలం అమెరికన్ యూజర్లకు మాత్రమే ఉంటుందా లేక భారతీయ వినియోగదారులకు కూడా కంపెనీ ఇస్తుందా అనేది ఇంకా స్పష్టం కాలేదు.