- Telugu News Photo Gallery Science photos The 5 Long life Animals on the earth the turtle in India lived for 255 years
Long Life Animals: ప్రపంచంలో ఎక్కువ రోజులు జీవించే జీవులు ఏవో మీకు తెలుసా? వీటి ఆయుష్షు తెలిస్తే ఆమ్మో అంటారు!
భూమిపై ఎక్కువకాలం జీవించే జీవులు ఏవో మీకు తెలుసా? వాటి పేర్లు మీకు చెబితే వాటికి అంత ఆయుష్షు ఉందా అని ఆశ్చర్యం వేస్తుంది. మానవుల గరిష్ట జీవితకాలం 100 సంవత్సరాలైతే.. ఇప్పుడు మీకు చెప్పబోతున్న జీవులు అంతకు మించి బతికేస్తాయి..
Updated on: Aug 25, 2021 | 12:11 PM

తాబేలు తాబేలు ఎక్కువ కాలం జీవించే జీవి. ఇది రెండు వందల ఏళ్లకు పైగా జీవిస్తుంది. కోల్ కతాలోని అలీపూర్ జంతు ప్రదర్శనశాలలో అడ్వేత అనే తాబేలు 255 ఏళ్ల వయసులో మరణించింది. ఈ మగ తాబేలు 250 కిలోల బరువు ఉండేది.

రఫియన్ రాక్ ఫిష్ జీవించి ఉన్న అతి పెద్ద చేపలతో ఒకటి. ఇది కనీసం 205 సంవత్సరాలు జీవిస్తుంది. లేత గులాబీ రంగులో ఉండే ఈ చేప పసిఫిక్ మహాసముద్రంలో కాలిఫోర్నియా నుంచి జపాన్ వరకూ కనిపిస్తుంది. ఇది 38 అంగుళాల వరకూ పొడవు పెరుగుతుంది. ప్రస్తుతం ఈ చేప అంతరించి పోతున్న జీవుల జాబితాలో ఉంది.

బౌ హెడ్ వేల్: ఇది ఆర్కిటిక్ సముద్రాల చుట్టుపక్కల కనిపిస్తుంది. ఇది వంద సంవత్సరాలకు పైగా జీవిస్తుంది. వేటకు గురికాకపోతే ఈ జీవులు 200 ఏళ్ళు కూడా జీవించేస్తాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే.. దేని శరీరంలో ఉన్న ERCC1 అనే జన్యువు.. శరీరంలో దెబ్బతిన్న డీఎన్ఏ ను బాగు చేస్తూనే ఉంటుంది. అందువల్ల ఈ చేపలకు క్యాన్సర్ వంటి జబ్బులు రానేరావు.

మంచినీటి పెర్ల్ మసెల్స్ నీటిలో ఉండే ఆహార పదార్ధాల ఆచక్కటి కణాలను ఫిల్టర్ చేసి వాటి కడుపుని నింపుకుని బ్రతికే జీవులు. ఇవి సాధారణంగా నదులలో కనిపిస్తాయి. ఒక నివేదిక ప్రకారం ప్రపంచంలోని పురాతన మంచినీటి పెర్ల్ మస్సెల్ వయసు 280 ఏళ్ళు. వీటి జీర్ణక్రియ చాలా నెమ్మదిగా ఉండటంతో ఇవి చాలాకాలం జీవిస్తాయని భావిస్తారు.

ఆర్కిటిక్ మహాసముద్రంలో లోతులో నివసించే ఈ గ్రీన్లాండ్ షార్క్ 24 అడుగుల వరకూ పెరుగుతుంది. ఇది అనేక రకాల సముద్ర జీవులకు ఆహారాన్ని అందిస్తుంది. ఎక్కువకాలం జీవించే గ్రీన్లాండ్ షార్క్ వయస్సు 392 సంవత్సరాలు.



